అంతర్జాతీయ T20 క్రికెట్లో అద్భుతం జరిగింది. మహిళల విభాగంలో ఓ బౌలర్ ఏకంగా 9 వికెట్లు తీసి, సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కలహరి మహిళల T20 టోర్నీ-2026లో భాగంగా లెసోథోతో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ బౌలర్ లారా కార్డోసో ఈ చారిత్రక ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్లో 3 ఓవర్లు వేసిన ఆమె.. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి, ఓ హ్యాట్రిక్ సహా 9 వికెట్లు పడగొట్టింది.