మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(MCG)లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో బుమ్రా సరికొత్త రికార్డ్ సృష్టించాడు. తొలి రోజు ఆటలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో MCGలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. MCGలో బుమ్రా మూడు మ్యాచ్‌లు ఆడి మొత్తం 18 వికెట్లు తీసుకున్నాడు. అంతకు ముందు అనిల్ కుంబ్లే(15) పేరిట ఈ రికార్డ్ ఉండేది.