భారత్ మరో వికెట్‌ను కోల్పోయింది. నాథన్ లైయన్ బౌలింగ్‌లో LBగా జడేజా (17) పెవిలియన్‌కు చేరాడు. DRS తీసుకున్నా భారత్‌కు సానుకూల ఫలితం రాలేదు. సమీక్షలో ‘అంపైర్స్ కాల్’ నిర్ణయం రావడంతో నిరాశగా జడేజా డగౌట్‌కు వెళ్లాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 222/7. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 53 పరుగులు అవసరం.