బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. అతడు కావాలనే ఆస్ట్రేలియా అరంగేట్ర ఆటగాడు కొన్స్టాస్ను ఢీకొట్టాడని పలువురు తప్పుబడుతున్నారు. దీనిపై ICC చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కోహ్లీ తప్పు చేశాడని ఐసీసీ నిర్ధారిస్తే 3-4 డీ మెరిట్ పాయింట్లు ఇవ్వడంతో పాటు ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించే అవకాశం ఉంది.