CTR: నగరి మున్సిపల్ పరిధి కరకంఠాపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ విజయగణపతి ఆలయం మహా కుంభాభిషేక వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పూర్ణాహుతి పూజలు, కలశపూజల్లో ఆమె పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.