KCR అప్పట్లో వెనకాల ఇలా.. ఇప్పుడు ఓ రాష్ట్ర సీఎంగా, పాత ఫోటో వైరల్
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉమ్మడి ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో మాట్లాడుతుండగా.. వెనకాల కేసీఆర్ నిల్చొని ఉన్నారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
KCR Old Photo:రాజకీయాల్లో ఎప్పుడూ ఏమీ జరుగుతుందో చెప్పలేం. రాత బాగుండి, సమయం కలిసి వస్తే చాలు.. కింగ్ మేకర్ (king maker) అవుతారు. మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని కాపాడే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మాదిరిగా అన్నమాట. ఆ వార్తలో ఉన్న ఫోటో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఆ పిక్ (pic) చూస్తేనే తెలుస్తోంది.. ఎన్ని ఏళ్ల కిందదో అని.. ఆ ఫోటోలో ఇప్పటి సూపర్ స్టార్ రజనీకాంత్ (rajinikanth), టీడీపీ అధినేత చంద్రబాబు (chandrababu), బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (kcr) సహా నేతలు ఉన్నారు.
ఆ ఫోటోలో రజనీకాంత్ (rajinikanth) మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. పక్కన టీడీపీ నేతలు.. చంద్రబాబు నాయుడు (chandrababu) ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీ హాల్లో మీడియాతో మాట్లాడుతున్న ఫోటో అదీ.. అందులో రజనీకాంత్ (rajinikanth) ప్రసంగిస్తుండగా.. మిగతా అందరూ అతనినే చూస్తున్నారు. మెజార్టీ నేతలు అతనిని ఓ స్టార్లా ట్రీట్ చేశారు. చంద్రబాబు, కేసీఆర్ (kcr) సహా అంతా.. అతని వైపు ఆసక్తిగా చూశారు.
చంద్రబాబు- రజనీకాంత్ (rajinikanth) మధ్య మంచి స్నేహాం ఉంది. హైదరాబాద్ (hyderabad) వచ్చిన ప్రతీసారి కలుస్తూ ఉంటారు. విజయవాడలో (vijayawada) జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. ఆ మధ్య హైదరాబాద్‌లో కూడా ఓ సారి కలిశారు. విజయవాడలో ఎన్టీఆర్ గురించి రజనీకాంత్ (rajinikanth) చేసిన కామెంట్లు కాక రేపాయి. ఈ క్రమంలో ఫోటో బయటకు వచ్చింది. అతని పక్కన చంద్రబాబు ఉండగా.. వెనకాల కేసీఆర్ ఉన్నారు. అప్పుడు కేసీఆర్ (kcr) టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ముఖ్య నేతలు చంద్రబాబు పక్కన కూర్చొగా కేసీఆర్ మాత్రం నిలబడి ఉన్నారు. దవడ మీద ఎడమ చేయి వేసి.. ఆ చేతికి ఉన్న వాచీ కూడా ఫోటోలో కనిపిస్తోంది.
ఇప్పుడు కేసీఆర్.. తెలంగాణకు సీఎం, ఓ పార్టీకి అధినేత.. అంతకుముందు మాత్రం ఓ పార్టీ ఎమ్మెల్యే.. మంత్రి పదవీ కూడా చేపట్టారు. ఆ ఫోటో మాత్రం సింప్లిసిటీని తెలియజేస్తోంది. బండ్లు ఓడలు- ఓడలు బండ్లు అనే సామెత కరెక్టుగా సరిపోతుంది. రజనీకాంత్ (rajinikanth)- చంద్రబాబు వెనకాల నిలబడి ఉన్నారు. పదిమందిలో కేసీఆర్ కూడా ఒక్కరు. ఆ సమయంలో ఏమంత ప్రాధాన్యం లేదు. నలుగురిలో నారాయణ అన్నట్టు కేసీఆర్ కనిపించారు.
1997-99 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ (kcr) మంత్రిగా పనిచేశారు. 1999లో మాత్రం మరోసారి మంత్రి పదవీ అవకాశం చంద్రబాబు ఇవ్వలేదు. డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇచ్చారు. అలా రెండేళ్లు గడిచింది. చివరకు 2001 ఏప్రిల్ 21వ తేదీన టీడీపీ, డిప్యూటీ స్పీకర్ పోస్ట్‌కు రాజీనామా చేశారు. అదే ఏడాది ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి (trs) ఏర్పాటు చేశారు. స్వ రాష్ట్రం కోసం 14 ఏళ్లు పోరాడి.. చిరకాల స్వప్నం సాకారం చేసుకున్నారు. వరసగా రెండోసారి సీఎం పదవీ (cm post) చేపట్టారు. తన పార్టీని జాతీయ పార్టీగా విస్తరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు.
ఒకప్పుడు చంద్రబాబు (chandrababu) వెనకలా ఉన్న కేసీఆర్ (kcr) ఈ రోజు తెలంగాణ సీఎం.. అదే చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. రజనీకాంత్ (rajinikanth) స్టార్‌గానే ఉన్నారు.. తప్ప రాజకీయంగా ఎదగలేదు. రాజకీయ పార్టీ పెట్టి.. దానిని సేవా కార్యక్రమాలకు వినియోగించారు. ఇప్పుడు కేసీఆర్ లెవల్ మాత్రం మరో రేంజ్లో ఉంది. ఆ ఫోటో.. కాల మాన పరిస్థితులు మారతాయడానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.