»Tdp Mp Kesineni Nani Key Comments On Vijayawada Politics
Vijayawada ఎవరితోనైనా కలిసి పని చేస్తా.. నా ఊపిరి విజయవాడ: కేశినేని నాని వ్యాఖ్యలు
ఎవరితోనైనా కలిసి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకే. నా శ్వాస, నా ఊపిరి అన్ని బెజవాడ పార్లమెంట్ కోసమే ఉంటుంది
తెలుగుదేశం పార్టీ తీరుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రశంసలు కురిపిస్తున్న ఆయన తాజాగా సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పిట్టల దొరకైనా ఎంపీ సీటు ఇచ్చుకోవచ్చని పేర్కొనడం కలకలం రేపింది. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడం చర్చనీయాంశమైంది.
విజయవాడలో (Vijayawada) ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో పాల్గొన్న ఎంపీ నాని మీడియాతో మాట్లాడుతూ ఇటీవల పరిణామాలపై స్పందించారు. ‘ఎంపీగా టీడీపీ (TDP) ఏ పిట్టల దొరకు టికెట్ ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు. నేను స్వతంత్ర అభ్యర్థిగా (Indipendant Candidate) అయినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రజలు కోరుకుంటే గెలుస్తా’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారోనని వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు.
‘నా ఈ మాటలను పార్టీ ఎలా తీసుకున్నా నాకు భయం లేదు. అభివృద్ధి (Development) విషయంలో పార్టీలతో సంబంధం లేదు. ఎవరితోనైనా కలిసి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకే. నా శ్వాస, నా ఊపిరి అన్ని బెజవాడ పార్లమెంట్ కోసమే ఉంటుంది.’ అని స్పష్టం చేశారు. ‘ఎన్నికల సమయంలో (Election Time) రాజకీయాలు.. తర్వాత అభివృద్ధి మాత్రమే. ఒక పార్టీ ఎంపీ మరో పార్టీ ఎమ్మెల్యే అభివృద్ధి కోసం పని చేస్తే తప్పా? పదేళ్లు నేను చేసిన పని దేశంలో ఎవరు చేశారో చూపండి’ అంటూ సవాల్ చేశారు. ‘నాకు ట్రాక్ రికార్డ్ (Track Record) ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి ఢిల్లీ స్థాయిలో ఏదైనా చేయిస్తా.. పార్టీ సిద్ధాంతం కోసం పోరాటం చేయాలి కానీ.. ఈ పిచ్చిగోల ఏమిటి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వ్యాఖ్యలు చూస్తుంటే కేశినేని నాని వైసీపీతో (YCP) జత కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల సమయం వరకు వైసీపీ కండువా వేసుకునేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన మహానాడుకు (Mahanadu) నాని దూరంగా ఉన్నారు. విజయవాడ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన నాని టీడీపీలో సీనియర్ నాయకుడిగా వెలుగొందుతున్నారు. నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్న ఆయన అకస్మాత్తుగా పార్టీపై అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారు.