»Khalistanis Heckle Down Rahul Gandhi Muhabbat Ki Dukaan At Us Event
USలో రాహుల్ గాంధీకి పరాభవం.. సభలో వ్యతిరేక నినాదాలతో కలకలం
తన నాన్నమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను ప్రస్తావించారు. ఈ సందర్భంగా నాడు జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను గుర్తు చేశారు. ఈ సమావేశానికి హాజరైన కొందరు రాహుల్ కుటుంబానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనేక మలుపుల తర్వాత ఎట్టకేలకు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయన పర్యటనలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఆయన ప్రసంగిస్తుండగా కొందరు నినాదాలు చేశారు. ఆ నినాదాలను ప్రశాంతంగా విన్న రాహుల్ వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ పరిణామం భారతదేశంల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పరస్పర విమర్శలకు దారి తీసింది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో బుధవారం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (Indian Overseas Congress) ‘మొహబత్ కి దుకాణ్’ అనే కార్యక్రమం నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.. తన నాన్నమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) హత్యను ప్రస్తావించారు. ఈ సందర్భంగా నాడు జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను గుర్తు చేశారు. ఈ సమావేశానికి హాజరైన కొందరు రాహుల్ కుటుంబానికి వ్యతిరేకంగా నినాదాలు (Slogans) చేశారు. ఈ సందర్భంగా ఖలీస్థాన్ జెండాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.
ఈ పరిణామంపై రాహుల్ ప్రశాంతంగా ఉన్నారు. కొద్దిసేపు మౌనంగా గ్రహించారు. అనంతరం ‘విద్వేష మార్కెట్ (Market)లో ప్రేమ దుకాణాలు’ అని అభివర్ణించారు. ఆందోళనకారులకు దీటుగా కాంగ్రెస్ మద్దతుదారులు (Supporters) భారత్ జోడో అంటూ నినాదాలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరిపై అభిమానం ఉంటుంది. మేం ఎవరిపై కోపాన్ని, ద్వేషాన్ని ప్రదర్శించం. ప్రతి వ్యక్తి ఆవేదనను వింటాం’ అని రాహుల్ తాజా పరిణామంపై స్పందించారు.
కాగా ఈ వీడియోను బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ మాలవియా (Amit) ట్విటర్ లో పంచుకున్నారు. ‘1984 నాటి మారణహోమానికి స్పందన ఇది. మీరు రాజేసిన నాటి అగ్ని ఇప్పటికీ మండుతూనే ఉంది’ అని పోస్టు చేశారు. కాగా ఈ పరిణామంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య పరస్పర విమర్శలు మొదలయ్యాయి.
Poor Pappu @RahulGandhi ! He didn’t face Nafrat/Hatred in India but had to face it in USA where The Deadly Anti -India Khalistani Terror!st heckled him for 1984 Sikh Genocide by his father ::pic.twitter.com/vpkMUopxUz