ఆహార పదార్థాలు కల్తీ అవుతున్న క్రమంలో ప్లాస్టిక్ కోడిగుడ్ల విక్రయం జరుగుతోంది. అయితే ఈ నకిలీ ఆహార పదార్థాలతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని టిప్స్ ద్వారా నకిలీ గుడ్లను గుర్తించవచ్చు. ప్లాస్టిక్ గుడ్లు చాలా స్మూత్‌గా ఎలాంటి పగుళ్లు లేకుండా పెయింట్ వేసినట్లు ఉంటాయి. తేలికగా ఉండి నీటిలో వేస్తే పైకి తేలుతాయి. నిజమైన గుడ్లు ఊపితే సౌండ్ వస్తుంది కానీ ప్లాస్టిక్ గుడ్లకు అలా జరగదు.