SRD: రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు ఇంకెప్పుడు ప్రారంభిస్తారని ఖేడ్ మాజీ MLA భూపాల్ రెడ్డి కాంగ్రెస్ పాలనపై ఎద్దేవా చేశారు. ఖేడ్ లో మంగళవారం మాట్లాడుతూ నియోజకవర్గంలో 25 శాతం ధాన్యం పంట దిగుబడులు జరిగినా,ఇప్పటికీ వడ్ల కాంటా ప్రారంభించలేదన్నారు. కాంగ్రెస్ దిగ్గజ నేతలు గతంలో రైతులకు ఇస్తామన్నా పంట బోనస్ విస్మరించి, మోసం చేశారని ఆరోపించారు.