ప్రకాశం: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం అమ్మకాలు జరపాలని, ఇష్టారాజ్యంగా అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని దర్శి ఎక్సైజ్ శాఖ సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం దర్శిలో మద్యం దుకాణాల వద్ద MRP ధరలకు అమ్మాలని సూచించే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. దర్శి-5, రూరల్-4, కురిచేడు-3, దొనకొండ-3, ముండ్లమూరు-4, తాళ్లూరు – 4 మద్యం షాపులు ఉన్నట్లు వెల్లడించారు.