BDK: పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి అధికారులు అంతా కృషి చేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారి సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి కేసును సమగ్రంగా దర్యాప్తు చేపట్టి క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని కోరారు.