VZM: జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వార్షిక తనిఖీల్లో భాగంగా గజపతినగరం పోలీస్ స్టేషన్ను మంగళవారం సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, లాకప్ సెల్స్, ప్రాపర్టీ రూం పరిశీలించారు. స్టేషన్ ప్రాంగణంలో సీజ్ చేసి ఉన్న ద్విచక్ర మరియు ఇతర వాహనాలను పరిశీలించి, ఏ నేరంలో ఏ తరహా వాహనాలను సీజ్ చేసినది అధికారులను అడిగి తెలుసుకున్నారు.