NLR: జిల్లాలో వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతునందున రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్లో వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రైతుల భూములకు సంబంధించి మట్టి నమూనా పరీక్షలు చేపట్టాలన్నారు.