AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు తుపానుగా మారే అవకాశం ఉందని.. విశాఖ వాతావరణశాఖ అధికారి తెలిపారు. 24న పూరి, పశ్చిమ బెంగాల్ తీరంలో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందన్నారు. తుపాను తీరం దాటే సమయంలో 100-120 కి.మీ బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఉత్తర కోస్తాంధ్రాలో 25న పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాష్ట్రంలోని పోర్టులకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.