దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ తయారీ కంపెనీ బజాజ్ పల్సర్ బైక్‌లకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఆ కంపెనీ తాజాగా మరో కొత్త మోడల్ బైక్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ‘బజాజ్ పల్సర్ N125’ దీని ప్రారంభ ధర రూ.94,707(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. ఈ బైక్ పర్పుల్ ప్యూరీ, కాక్టెయిల్ వైన్ రెడ్, సిట్రస్ రష్, ఎబోనీ బ్లాక్, కరేబియన్ బ్లూ, పెర్ల్ మెటాలిక్ వైట్‌లో అందుబాటులో ఉంది.