ప్రకాశం: యర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఈ నెల 26 నుంచి జరగబోయే సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ సభ్యత్వంతో ప్రతి ఒక్కరికి భరోసా కింద రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు.