NGKL: నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవిని మంగళవారం అచ్చంపేట నియోజకవర్గం వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సందర్భంలో ఆయనను కాంగ్రెస్ కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలిసి మండల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.