VZM: భూ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నామని, ఉప తహసీల్దార్ నారాయణమ్మ తెలిపారు. మంగళవారం గుజ్జింగివలస, మీసాలపేట గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మూటేషన్, అడంగల్ కరెక్షన్, భూమిహద్దులు మారిన, ఖాతా నెంబర్లు, పట్టాదారుడు వివరాల్లో తప్పులు ఉంటే సరిదిద్దుతామని అన్నారు.