AP: ప్రకాశం జిల్లా ఒంగోలులో మరోసారి ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రేపు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ సంద్భంగా బాలినేని అభిమానులు నగరంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. దీనిపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీల చింపివేత వ్యవహారంపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.