»Virat Kohli Response About Rcbs Exit From Ipl 2023
RCB కష్టపడినా ఓడిపోయాం.. బలంగా తిరిగొద్దాం: ఐపీఎల్ పై కోహ్లీ భావోద్వేగం
గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం మూటగట్టుకున్న బెంగళూరు ఐపీఎల్ నుంచి వైదొలగింది. మరోసారి నిరాశ ఎదురవడంతో బెంగళూరు, ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంచనాలు అందుకోకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు.
ఐపీఎల్ వచ్చి 16 ఏళ్లు దాటింది.. అప్పటి నుంచి బరిలోకి దిగుతున్నా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టు మాత్రం ట్రోఫీని దక్కించుకోలేదు. కొన్నిసార్లు ఆఖరి మెట్టు వరకు వచ్చి బోల్తా కొడుతోంది కానీ.. కప్ ను మాత్రం కొల్లగొట్టడం లేదు. ఈసారి కూడా అదే పునరావృతమైంది. తాజా సీజన్ లో అయితే ప్లేఆఫ్స్ (Playoffs)ను గట్టెక్కలేదు. ఆఖరి లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) చేతిలో పరాజయం మూటగట్టుకున్న బెంగళూరు ఐపీఎల్ నుంచి వైదొలగింది. మరోసారి నిరాశ ఎదురవడంతో బెంగళూరు, ముఖ్యంగా విరాట్ కోహ్లీ (Virat Kohli) అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంచనాలు (Expectations) అందుకోకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ దశ దాటకపోవడంపై కోహ్లీ స్పందించాడు. దురదృష్టవశాత్తు లక్ష్యం సాధించలేదని.. మరింత బలంగా తిరిగొస్తామని ప్రకటించాడు. ఈ మేరకు ‘థ్యాంక్యూ బెంగళూరు’ అంటూ మద్దతు పలికిన బెంగళూరు అభిమానులకు (Fans) కోహ్లీ కృతజ్ణతలు తెలిపాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశాడు. దీంతోపాటు కొన్ని ఫొటోలు పంచుకున్నాడు.
‘ఈ సీజన్ (Season)లో మెరుగ్గా ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు మనం లక్ష్యానికి కొద్ది దూరంలో నిలిచిపోయాం. నిరాశ చెందినప్పటికీ.. మనం ఎప్పుడు తలెత్తుకునే ఉండాలి. ఈ ప్రయాణంలో మాకు వెన్నంటే నిలిచిన అభిమానులకు రుణపడి ఉంటాం. మా కోచ్ లు (Coach), యాజమాన్యం, మా జట్టు సభ్యులకు ధన్యవాదాలు. మరింత బలంగా తిరిగి వస్తాం’ అని కోహ్లీ పోస్టు చేశాడు. కాగా ఈ సీజన్ లో కోహ్లీ మెరుగైన ప్రదర్శన చేశాడు. మొత్తం 14 మ్యాచ్ ల్లో 53.25 సగటుతో 639 పరుగులు (Runs) సాధించాడు. వీటిలో రెండు శతకాలు, 6 అర్ధ శతకాలు ఉన్నాయి.
A season which had it's moments but unfortunately we fell short of the goal. Disappointed but we must hold our heads high. To our loyal supporters, grateful for backing us every step of the way. pic.twitter.com/82O4WHJbbn