వికారాబాద్ జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 2వ విడతలో 7 మండలాలు 175 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇప్పటికే 20 ఏకగ్రీవం అయ్యాయి. 155 స్థానాలకు సర్పంచ్లను ఎన్నుకోవాల్సి ఉంది. వికారాబాద్లో 70, ధరూర్లో 88, మోమిన్ పేటలో 90, నవాబ్ పేటలో 101, బంట్వారంలో 47, మర్పల్లిలో 73, కోట్పల్లిలో 41,మొత్తం 510 మంది పోటీలో ఉన్నారు.