AP: నేవీ డే వేడుకల్లో భాగంగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ అధ్వర్యంలో నేవీ మారథాన్-2025 ప్రారంభమైంది. RK బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు సాగనున్న ఈ మారథాన్లో విశాఖ కలెక్టర్, CP సహా 18 వేల మందికి పైగా పాల్గొన్నారు. ఈ క్రమంలో 41, 21, 10, 5KM విభాగాల్లో పోటీలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. మారథాన్ నేపథ్యంలో విశాఖ బీచ్ రోడ్డులో ఉ.10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.