BHNG: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ ,బీజేపీ నాయకులు బలపరిచిన అడ్డగూడూరు స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి కడారి ఉపేంద్ర రమేష్ అన్నారు. అడ్డగూడూరులో ఆయన నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి సర్పంచిగా తనను ఎన్నుకోవాలని అభ్యర్థించారు.