HNK: హసన్పర్తి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు. మండల పరిధిలో ఎన్ని గ్రామ పంచాయతీలలో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, పోలింగ్ కేంద్రాల వారిగా కేటాయించిన పీవోలు, ఓపీవోలు వచ్చారా అని అడిగి తెలుసుకున్నారు.