NLR: జిల్లాలోని హైవేపై శనివారం రాత్రి పోలీసులు పలు చోట్ల నాకా బంది చేపట్టారు. ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 25, ఓవర్ స్పీడ్ 7, ఎంవీ యాక్ట్ కేసులు 97 నమోదు చేశారు. రూ. 89,990ల జరిమానాలు విధించారు. సంఘ వ్యతిరేక పనులు ఎక్కడ జరిగినా 112కు డయల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.