CTR: బంగారుపాళెం మండలంలోని మొగిలీశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 17న తలనీలాలు పోగు చేసుకునే హక్కుకు సంబంధించి బహిరంగ వేలం నిర్వహించనున్నటు ఈఓ మునిరాజ తెలిపారు. ఆలయం ఆవరణ లో ఉదయం 10.30 గంటలకు దేవదాయశాఖ అధికారుల సమక్షంలో బహిరంగ వేలం ఉంటుందన్నారు. వేలం పాటలో పాల్గొనదలచిన వారు రూ.10 వేలు డిపాజిట్ చెల్లించి పాల్గొనాలని సూచించారు.