తూర్పుగోదావరి జిల్లాలో యూరియా పంపిణీలో ఇబ్బందులు రాకుండా, రైతులు క్యూ లైన్లలో నిలబడకూడదని జిల్లా సహకార అధికారి ఎం.వెంకటరమణ PACS సీఈఓలకు శనివారం స్పష్ట ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 107 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలకు ఈ మేరకు అవగాహనా కల్పించడం జరిగిందన్నారు. ప్రతి PACSలో రిజిస్టర్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు.