ప్రకాశం: కనిగిరి కొత్తపేటలోని కాశీనాయన ఆశ్రమంలో ఆదివారం కాశి నాయన 30వ ఆరాధన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు సుబ్బారెడ్డి తెలిపారు. ఉదయం స్వామివారికి గణపతి పూజతో ఆరాధన మహోత్సవం ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం ఆలయ కమిటీ, దాతల సహకారంతో అన్న సంతర్పణ జరుగుతుందన్నారు. కావున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని, తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.