BHPL: రెండో విడత GP ఎన్నికల్లో భాగంగా టేకుమట్ల మండలం వెలిశాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో 8 వార్డుల్లో 7 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఒకే ఒక్క వార్డులో ఏకగ్రీవం కుదరకపోవడంతో ఆ వార్డు సభ్యుడి ఎంపికకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా వార్డులు ముందే ఏకగ్రీవం కావడంతో గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొంది.