మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామంలో హృదయవిదారక హత్య జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్త, మామ, భర్త, మరిది కలిసి కోడలిని గొంతు పిసికి చంపారు. మృతురాలికి ఇద్దరు చిన్న పిల్లలు ఉండటంతో ఘటన మరింత విషాదంగా మారింది. హత్య అనంతరం నిందితులు పరారయ్యారు. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.