SRCL: ఇల్లంతకుంట మండలం రంగంపేట సర్పంచిగా మేడిపల్లి భాస్కర్ రెడ్డి గెలుపొందారు. హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో చివరిగా భాస్కర్ రెడ్డి విజయం సాధించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు సహకరించిన కాంగ్రెస్ నాయకులకు ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని స్పష్టం చేశారు.