AP: కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నెహ్రూచౌక్ సెంటర్లోని వస్త్రదుకాణాల్లో మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే మంటలు పక్కనే ఉన్న దుకాణాలకూ వ్యాపిస్తుండటంతో భారీ ఆస్తినష్టం జరిగే అవకాశముంది. ఫైర్ సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.