KRNL: కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అరుదైన బ్లడ్ గ్రూప్ డోనర్ చిన్న సుంకన్న నిన్నటితో 50వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఆయన రక్తదానం చేయడమే కాక, అనేక మందిని రక్తదాతలుగా ప్రోత్సహించారు. ఈ సందర్భంగా 2 టౌన్ సీఐ నాగరాజు రావు చేతుల మీదుగా ఆదివారం సుంకన్నను శాలువాతో ఘనంగా సన్మానించి, అభినందించారు.