ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. రాంచీలో జరిగిన తొలి టీ20లో టీమిండియా న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో హార్థిక్ సేన ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
మూడు మ్యాచ్లో సిరీస్ను గెలుచుకోవాలంటే నేడు జరిగే మ్యాచ్ లో హార్ధిక్ సేన తప్పనిసరిగా గెలవాల్సిన ఉంది. అయితే టీమిండియా తుది జట్టుపైనే అందరి దృష్టి ఉండటంతో మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది. టీమిండియాలో ముఖ్యంగా రెండు కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ స్థానంలో పృథ్వీ షాను తుదిజట్టులోకి ఎంపిక చేసుకోనున్నారు. మొదటి టీ20 మ్యాచ్ లోనూ పెద్దగా పరుగులేమీ చేయకుండానే ఇషాన్ పెవిలియన్ బాటపట్టడంతో తుది జట్టు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ దీపక్ హుడా విఫలమవుతూ ఉండటం వల్ల అతని స్థానంలో వికెట్ కీపర్, బ్యాటర్ జితేష్ శర్మను టీమ్ లోకి తీసుకునే అవకాశం కూడా ఉంది.