Rohit Sharma: సౌతాఫ్రికాతో వన్డే, టెస్ట్, టీ 20లకు జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. టీ 20లకు నాయకత్వం వహించే అంశంపై సమస్య వచ్చి పడింది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయపడ్డారు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు పార్ట్ టైమ్‌గా సూర్యకుమార్ యాదవ్ సేవలను ఉపయోగిస్తున్నారు. సో.. టీ 20లకు కెప్టెన్ కోసం సెలక్టర్లు చూస్తున్నారు.
ఐపీఎల్ తప్ప టీ 20ల నుంచి రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ తప్పుకున్నారు. జూనియర్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో దూరంగా ఉంటున్నారు. సో.. ఇప్పుడు రోహిత్ తప్ప మరో ఆప్షన్ లేదు. సౌతాఫ్రికా సిరీస్ కోసం కెప్టెన్సీ వహించాలని కోరుతోంది. మూడు ఫార్మాట్ల కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించనుంది. ఆ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షా ఢిల్లీలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని కలుస్తారు. టీ 20 ప్రపంచ కప్ కోసం రోడ్ మ్యాప్ రూపొందిస్తారు.
బీసీసీఐ కోరికను రోహిత్ శర్మ (Rohit) అంగీకరిస్తే టీ 20లో మళ్లీ ఆడతాడు. సౌతాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్ నుంచి మాత్రం విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. రోహిత్ టెస్టుల నుంచి తప్పుకుంటే.. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వస్తారు. దీంతో అజింక్య రహానేపై వేటు పడే అవకాశంఉంది. చతేశ్వర్ పూజారాకు కూడా చోటు దక్కకపోవచ్చు.