»Severe Economic Crisis In Sri Lanka Election Postponed
Sri Lanka : శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం. ఎన్నికలు వాయిదా
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక (Sri Lanka) ప్రభుత్వం తాజాగా స్థానిక ఎన్నికలను వాయిదా వేసింది. నిధుల లేమి కారణంగా మార్చి 9న జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం వద్ద కేవలం 500 మిలియన్ డాలర్ల విదేశీ మారకం మాత్రమే ఉండటంతో శ్రీలంక ప్రస్తుతం నిధుల కొరతతో ఇక్కట్ల పాలవుతోంది.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక (Sri Lanka) ప్రభుత్వం తాజాగా స్థానిక ఎన్నికలను వాయిదా వేసింది. నిధుల లేమి కారణంగా మార్చి 9న జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం వద్ద కేవలం 500 మిలియన్ డాలర్ల విదేశీ మారకం మాత్రమే ఉండటంతో శ్రీలంక ప్రస్తుతం నిధుల కొరతతో ఇక్కట్ల పాలవుతోంది. చైనా నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకున్న శ్రీలంక ఒక్కసారిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీలంకకు సాయం అందించేందుకు ఐఎంఎఫ్ ముందుకు వచ్చింది. అయితే.. శ్రీలంక చెల్లించాల్సిన రుణాల పునర్వ్యవస్థీకరణపై చైనాతో ఐఎంఎఫ్‌కు (IMF) ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అడుగు ముందుకు పడటం లేదు.
శ్రీలంకను ఆదుకునేందుకు రంగంలోకి దిగిన అమెరికా.. ఐఎంఎఫ్ ద్వారా సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. చైనా రుణాల చెల్లింపులపై 10 ఏళ్ల మారటోరియం విధించాలని శ్రీలంక కోరుతోంది. అయితే.. ఈ వెసులుబాటు కల్పిస్తే చైనా లోన్లు తీసుకున్న ఇతర దేశాలకు ఇదే అవకాశం కల్పించాల్సి వస్తుందని చైనా ప్రభుత్వం భావిస్తోంది. దీంతో.. ఈ పీటముడి శ్రీలంకను మరిన్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది. దివాళా తీసిన శ్రీలంక వచ్చే నెలలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికి సిద్ధంగా ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ రోజు ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో పార్లమెంటును వాయిదా వేయవలసి వచ్చింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంపై నెలల తరబడి నిరసనల తర్వాత జూలైలో పదవీ బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు మార్చి 9 నాటి ఓటింగ్ కీలకమైన పరీక్ష కానుంది. ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, ఇంధనం లేదా పోలింగ్ బూత్‌లకు పోలీసు రక్షణ కోసం నిధులు ఇవ్వడానికి ట్రెజరీ (Treasury) నిరాకరించినట్లు తెలిసిందిఎన్నికల కమిషన్ చీఫ్ నిమల్ పుంచిహెవా మాట్లాడుతూ.. ‘సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తామని ఇటీవల సుప్రీంకోర్టుకు( Supreme Court ) హామీ ఇచ్చాను.
కానీ, ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేయనందున దానిని చేయలేమని ఇప్పుడు కోర్టుకు తెలియజేస్తున్నాను.” అని అన్నారు. దేశ ఆదాయం జీతాలు,(salaries )పింఛన్లు, అవసరమైన సేవలను నిర్వహించడానికి సరిపోదు కాబట్టి ఎన్నికలు అసాధ్యమని అధ్యక్షుడు గతంలో చెప్పారు. నిరసనకారులు అధ్యక్ష భవనంపై దాడి చేయడంతో గొటబాయ రాజపక్సే(Gotabaya Rajapakse)స్థానంలో వచ్చిన విక్రమసింఘే, అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి బెయిలౌట్ పొందే ప్రయత్నంలో పన్నుల పెంపుదల, ధరల పెరుగుదలను అమలు చేశారు.ఓటరు పరిశీలనను నివారించి అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేయడంతో పార్లమెంట్ (Parliament) మంగళవారం వాయిదా పడింది. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసేందుకు, ఎన్నికలను విధ్వంసం చేసేందుకు ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఉపయోగిస్తోందని ప్రతిపక్ష ఎంపీ విమల్ వీరవన్స అన్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక అత్యున్నత న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది,