భారత జోడో యాత్రతో ప్రజల సహకారం చూసి తన కళ్ల వెంట నీరు కారిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ముగిసిన నేపథ్యంలో శ్రీనగర్ లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. మంచు వానను సైతం లెక్కచేయకుండా ఆయన ప్రసంగించారు. తన పాదయాత్రకు సహకరించిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.జోడో యాత్రతో ప్రజల సహకారం చూసి తన కళ్ల వెంట నీరు కారిందని రాహుల్ అన్నారు. భారత్ జోడో యాత్ర ముగిసిన నేపథ్యంలో శ్రీనగర్ లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. హిమపాతాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన ప్రసంగించారు. తన పాదయాత్రకు సహకరించిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.
తాను ఒక దశలో తన పాదయాత్రను పూర్తి చేయగలనా? అని అనుకున్నానని చెప్పారు. తీవ్ర చలిని కూడా పట్టించుకోకుండా ప్రజలు తన యాత్రలో పాల్గొన్నారని తెలిపారు.ప్రజల నుంచి మద్దతు రాకపోతే ఏదీ సాధ్యం కాదని చెప్పారు.”నలుగురు చిన్నారులు నా వద్దకు వచ్చారు. వారు యాచిస్తూ కడుపునింపుకుంటున్నారు. వారు దుస్తులు కూడా వేసుకోలేదు. వారు చలికి వణికిపోయారు. వారికి తినడానికి ఆహారం కూడా దొరకడం లేదనుకుంటా. వారు స్వెట్టర్లు, జాకెట్లు వేసుకోవడం లేదు.. దీంతో నేను కూడా వాటిని వేసుకోకూడదని అనుకున్నాను” అని రాహుల్ గాంధీ చెప్పారు.