»Pm Modi Massive Banner Flies High In New York Sky
PM Modi US Visit: ఆకాశంలో 250అడుగుల బ్యానర్.. అమెరికాలో మోడీ క్రేజ్ మామూలుగా లేదు
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానికి స్వాగతం పలికారు. న్యూయార్క్ ఆకాశ వీధులో పెద్ద బ్యానర్‌ని లాగుతున్న విమానం మోడీ స్వాగత సందేశాన్ని అందించింది. బ్యానర్‌పై "అమెరికాకు చారిత్రక సందర్శన" అని రాసి ఉంది.
PM Modi US Visit: ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ నాలుగురోజులుగా అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ చారిత్రాత్మక పర్యటన సందర్భంగా అమెరికాతో అనేక ముఖ్యమైన ఒప్పందాలపై సంతకం చేశారు. ఈ తరుణంలో ఎఫ్ఐఏ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్) న్యూయార్క్‌లోని హడ్సన్ నదిపై 250 అడుగుల పొడవైన బ్యానర్‌ను ఎగురవేసి, అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానికి స్వాగతం పలికారు. న్యూయార్క్ ఆకాశ వీధులో పెద్ద బ్యానర్‌ని లాగుతున్న విమానం మోడీ స్వాగత సందేశాన్ని అందించింది. బ్యానర్‌పై “అమెరికాకు చారిత్రక సందర్శన” అని రాసి ఉంది. పిఎం మోడీ, యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ ఫోటోలు కూడా ఉన్నాయి.
ఈ వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ‘అమెరికాలోని న్యూయార్క్‌లోని స్కై వీధుల్లో’ అని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో న్యూయార్క్‌లోని ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, నయాగరా జలపాతం భారత జెండా రంగుల్లో వెలిగిపోయాయి. ప్రధాన మంత్రి తన పర్యటనలో పలువురు అమెరికా పౌరులు, థింక్ ట్యాంక్‌లు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, ఐటీ, టెక్ ప్రముఖులతో సంభాషించారు. ప్రధాని మోడీ అమెరికాలో ఎక్కడికి వెళ్లినా ఘనస్వాగతం లభిస్తోంది. ప్రవాస భారతీయులు ముక్తకంఠంతో ప్రధాని మోడీకి జై.. భారతమాతకు జై అని నినదిస్తున్నారు.