• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సామూహిక వివాహాలకు హాజరైన ఎమ్మెల్యే

NZB: బాల్కొండ మండలం రంగనాథ స్వామి సాక్షిగా, పైలా నరసింహయ్య యాదవ్ ఆధ్వర్యంలో 24 జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం నూతన వధూవరులను ఆశీర్వదించారు. పేద కుటుంబాలకు బాసటగా నిలుస్తూ నరసింహయ్య చేస్తున్న సామాజిక సేవ అభినందనీయమని కొనియాడారు.

March 8, 2026 / 04:20 PM IST

సృష్టికి మూల స్తంభం స్త్రీ: ఎమ్మెల్యే

ELR: సృష్టికి మూల స్తంభం స్త్రీ అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఆదివారం దెందులూరులో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గానికి సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన ‘బ్యాంకు లింకేజీ స్త్రీ నిధి-ఉన్నతి, pmajy’ పథకాల ద్వారా 13,594 మంది స్వయం సహాయక సంఘాల రూ.292 కోట్ల చెక్కు అందజేశారు.

March 8, 2026 / 04:20 PM IST

రేపు పెనుకొండలో పర్యటించనున్న మంత్రి

సత్యసాయి: పెనుకొండలో మంత్రి సవిత సోమవారం పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు పెనుకొండలో అంబేడ్కర్ సర్కిల్ ఎదురుగా ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నూతన బస్టాండ్‌ను మంత్రి ప్రారంభిస్తారు. 3:30 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

March 8, 2026 / 04:20 PM IST

‘రేపు కలెక్టరేట్‌లో యథావిధిగా PGRS కార్యక్రమం’

కోనసీమ: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలోనే కాకుండా ఆర్డీవో, ఎంపీడీవో, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, నిర్ణీత సమయంలో పరిష్కరించుకోవాలన్నారు.

March 8, 2026 / 04:20 PM IST

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

E.G: చాగల్లు ప్రధాన కూడలిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మార్కొండపాడుకు చెందిన పంది వీర్రాజు, నాగలక్ష్మి (52) దంపతులు శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. NTR విగ్రహం వద్ద ఎదురుగా వచ్చిన లారీ వారి మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

March 8, 2026 / 04:20 PM IST

రాకెట్లలో రాయలకాలపు తామ్ర శాసనాలు లభ్యం

ATP: ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి మూడు తామ్ర శాసనాలను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. క్రీ.శ. 1527లో తెలుగు, సంస్కృత భాషల్లో వీటిని రాయించినట్లు చరిత్రకారుడు బుక్కపట్నం గోపి తెలిపారు. వీటిని పూర్తిస్థాయి విశ్లేషణ కోసం మైసూరులోని పురావస్తు శాఖ కార్యాలయానికి పంపించామని ఆయన వివరించారు.

March 8, 2026 / 04:20 PM IST

మహిళలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాలు

SRPT: కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలకు ఉచిత గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మావతి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ముందస్తు జాగ్రత్తతో ప్రాణాంతకం వ్యాధులను అరికట్టవచ్చన్నారు.

March 8, 2026 / 04:19 PM IST

వన్ స్టాప్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

SKLM: మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వన్ స్టాప్ కేంద్రాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు వన్ స్టాప్ కేంద్రం ఎంతో ఉపయోగ పడుతుంద‌ని తెలిపారు.

March 8, 2026 / 04:16 PM IST

మహిళా పోలీస్ కానిస్టేబుళ్లను సన్మానించిన: డీఎస్పీ

MLG: పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కిషోర్ కుమార్ సిబ్బందితో కలిసి మహిళా పోలీస్ కానిస్టేబుల్లను శాలువతో సత్కరించారు. విధుల నిర్వహణలో మహిళా పోలీసులు చూపుతున్న ధైర్యం, సాహసం, నిబద్ధత అభినందనీయమని DSP కొనియాడారు. కార్యక్రమంలో సీఐ, ఎస్సై, పోలీసు సిబ్బంది ఉన్నారు.

March 8, 2026 / 04:16 PM IST

T20WC: భారత్‌కు కొరకరాని కొయ్యగా కివీస్

T20 WC ఫైనల్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు టీమిండియా T20 WC చరిత్రలో న్యూజిలాండ్‌పై ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. 2000లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2021లో జరిగిన టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో భారత్ ఓటమి పాలైంది. ఈరోజు ఫైనల్‌లో ఈ రెండు జట్లే తలపడుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

March 8, 2026 / 04:16 PM IST

దేవాలయాలు సమాజ ఐక్యతకు కేంద్ర బిందువులు

RR: చేవెళ్ల మండలంలోని నాంచేరి ఇంద్రారెడ్డి నగర్‌లో బీరప్ప, మల్లన్న దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి భక్తి పారవశ్యంలో మునిగారు. ఈ కార్యక్రమంలో మాజీ MLA కే రత్నం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు సమాజ ఐక్యతకు కేంద్ర బిందువులు అన్నారు.

March 8, 2026 / 04:16 PM IST

కలెక్టరేట్లో ఉమెన్స్ డే వేడుకలు

ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళా సాధికారత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

March 8, 2026 / 04:15 PM IST

కాపర్ వైర్ చోరీ చేస్తున్న పదిమంది సభ్యుల ముఠా అరెస్ట్

MNCL: తాండూర్ మండలంలో మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్ల నుంచి విలువైన కాపర్ వైర్ చోరీ చేస్తున్న పదిమంది సభ్యుల ముఠాను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి దొంగిలించిన కాపర్ స్వాధీనం చేసుకుని, వారిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ దేవయ్య తెలిపారు. ఈ ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

March 8, 2026 / 04:14 PM IST

ఈ నెల 12న నరసాపురంలో రేవు పాట

W.G: నరసాపురం మాధవాయిపాలెం-సఖినేటిపల్లి రేవు 2026-27 సంవత్సరానికి బహిరంగ వేలం ఈ నెల 12న నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎం.నాసరు రెడ్డి ఆదివారం తెలిపారు. ఇప్పటివరకు ఏడుగురు షెడ్యూళ్లను కొనుగోలు చేశారు. నరసాపురం ఎంపీడీవో కార్యాలయంలో సీల్ కం సీక్రెట్ పద్ధతిలో అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తరలిరావాలని కోరారు.

March 8, 2026 / 04:14 PM IST

నీతి ఆయోగ్ సదస్సుకు నిర్మల్ ‘పెంబి’ ఎంపిక

NRML: జిల్లా పెంబి బ్లాక్ మరో అరుదైన గౌరవం సాధించింది. మార్చి 9న విశాఖలో జరిగే నీతి ఆయోగ్ రీజనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ సదస్సుకు ఇది ఎంపికైందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. తెలంగాణ నుండి నిర్మల్, గద్వాల జిల్లాలకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. విద్య, ఆరోగ్యం (అమ్మ రక్షిత, బాలశక్తి), వ్యవసాయ రంగాల్లో పెంబి సాధించిన విజయాలను ఈ సదస్సులో వివరించనున్నారు.

March 8, 2026 / 04:14 PM IST