• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గరికపాటి ప్రవచనం.. అధిక సంఖ్యలో భక్తజనం

PDPL: పెద్దపల్లి జిల్లా మంథనిలో శకుంతలోపాఖ్యానం ప్రవచనాలకు విశేష స్పందన లభిస్తోంది. వివిధ మండలాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున హాజరవుతున్నారు. గరికిపాటి ప్రవచనాలు వినేందుకు తొలిరోజు వేసిన 2500 కుర్చీలు సరిపోలక, రెండో రోజు 600 అదనంగా ఏర్పాటు చేశారు. గురువారం చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది.

February 26, 2026 / 06:58 PM IST

పాల డైరీలలో అధికారుల తనిఖీలు

ప్రకాశం: ఒంగోలులో పాల డైరీలపై గురువారం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి. వేణుగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ అధికారి శంషాఖాన్, శివతేజ అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పాలలో కల్తీ జరుగుతోందన్న ఆరోపణలతో ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. అలాగే తాళ్లూరు మండలం సోమవరప్పాడులో కూడా తనిఖీ చేసి, పాల నమూనాలను సేకరించామని అధికారులు తెలిపారు.

February 26, 2026 / 06:58 PM IST

గుడ్, బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన

కృష్ణా: మోపిదేవిలోని జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు గుడ్, బ్యాడ్ టచ్ గురించి ఎస్సై గౌతమ్ కుమార్ గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే తల్లిదండ్రులకు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

February 26, 2026 / 06:58 PM IST

విజయ్, రష్మిక పెళ్లి ఫొటోలు వచ్చేశాయ్

విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 10:10కి రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను రష్మిక అభిమానులతో పంచుకుంది. ‘హాయ్ మై లవ్స్.. నా భర్తను మీకు పరిచయం చేస్తున్నా.. మిస్టర్ విజయ్ దేవరకొండ’ అని పోస్ట్ చేసింది.

February 26, 2026 / 06:58 PM IST

సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే

PLD: గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. పిడుగురాళ్లలోని పల్వరైజింగ్ మిల్లుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సంబంధిత మంత్రులు, అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

February 26, 2026 / 06:58 PM IST

‘ప్రతి విద్యార్థి బ్రాండ్ అంబాసిడర్ కావాలి’

MDK: ప్రతి విద్యార్థి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే బ్రాండ్ అంబాసిడర్‌గా మారాలని జిల్లా ఎస్పీ డివి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై ‘Arrive-Alive’ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండో విడత చేపట్టినట్టు వివరించారు.

February 26, 2026 / 06:58 PM IST

అభివృద్ధి పనులపై ఎంపీడీవో సమీక్ష

AKP: కోటవురట్ల మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీవో చంద్రశేఖర్ గురువారం మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. వివిధ దశలో ఉన్న పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు. అలాగే నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు చేరుకోవాలన్నారు. డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు, పీఆర్ ఏఈ వర్మ పాల్గొన్నారు.

February 26, 2026 / 06:57 PM IST

జిల్లాలో 20 కేంద్రాల్లో ‘నీట్’ పరీక్ష నిర్వహణ: కలెక్టర్

GNTR: మే 3న నిర్వహించనున్న నీట్ పరీక్ష కోసం జిల్లాలో 20 కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. గుంటూరు, తెనాలి, మంగళగిరి, అమరావతి ప్రాంతాల్లో ఈ కేంద్రాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్ జనరల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, పరీక్ష నిర్వహణపై సమీక్షించారు.

February 26, 2026 / 06:55 PM IST

కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తాం: మాజీ ఎమ్మెల్యే

GNTR: పొన్నూరు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో గురువారం అనుబంధ విభాగాల కమిటీ టాస్క్ ఫోర్స్ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో డిజిటలైజేషన్ సమీక్ష సమావేశం జరిగింది. సుధాకర్ బాబు ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేసి, రాబోయే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సభ్యులకు సముచిత స్థానం కల్పిస్తారని తెలిపారు.

February 26, 2026 / 06:53 PM IST

​కోర్టు వాయిదాలకు డుమ్మా.. జైలుకు నిందితుడు

SRPT: రెండు కేసుల్లో కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న చివ్వెంల మండలం ఆయిలపురం గ్రామ నివాసి చేర్కుపల్లి సైదులును పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సూర్యాపేట కోర్టు ఇతనిపై NBW జారీ చేయడంతో నిందితుడిని పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు అతడిని సూర్యాపేట సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.

February 26, 2026 / 06:52 PM IST

మంత్రి లోకేష్ పర్యటనకు ఏర్పాట్లు

AKP: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈనెల 28న రాంబిల్లి మండలం సీతపాలెంలో పర్యటిస్తున్న నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లను సీఐ నర్సింగరావు ఆధ్వర్యంలో పోలీసులు పరిశీలించారు. పార్కింగ్ ప్రాంతం, భద్రత ట్రాఫిక్ తదితర విషయాలపై చర్చించారు. బ్లూ జెట్ కంపెనీ ప్రారంభోత్సవానికి లోకేష్ ముఖ్యఅతిథిగా వస్తున్న విషయం తెలిసిందే.తగిన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

February 26, 2026 / 06:51 PM IST

జ్యోతిబా ఫూలే గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

పల్నాడు జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాలయాల్లో 5 నుంచి 8వ తరగతి , ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కన్వీనర్ పరమేశ్వరరావు గురువారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 4 నుంచి మార్చి 3 వరకు https://mjpapbcwreis.apcfss.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

February 26, 2026 / 06:51 PM IST

బాటసింగారం మార్కెట్‌లో తోతాపురి మామిడి రాక

RR: బాటసింగారం మార్కెట్‌లో తోతాపురి రకానికి చెందిన మామిడికాయలు పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. రుచితో పాటు, ఎగుమతులకు అనుకూలంగా ఉండటం వల్ల ఈ రకానికి భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే, 2025 సంవత్సరంలో మామిడి విక్రయాల ద్వారా మూడు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. దీంతో రైతులు, వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

February 26, 2026 / 06:50 PM IST

ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన సీఎం సోదరుడు

NGKL: వెల్దండ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతిరెడ్డి, MLA కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరై గురువారం ఇంటిని ప్రారంభించారు. MLA మాట్లాడుతూ..అర్హులైన పేదవాడికి గృహ నిర్మాణ పథకం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు.

February 26, 2026 / 06:50 PM IST

45 రోజుల్లో వెస్ట్ బైపాస్ పూర్తవుతుంది: కేశినేని చిన్ని

AP: విజయవాడ కలెక్టరేట్‌లో NH-65పై MP కేశినేని చిన్ని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’45 రోజుల్లో వెస్ట్ బైపాస్ పూర్తవుతుంది. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తాం. మెట్రో ప్రాజెక్టు ఆలస్యంతో ఫ్లైఓవర్ పనులు ఆగాయి. మెడికల్ కాలేజీ- నిడమానూరు వరకు 6 లేన్ల ఫ్లైఓవర్‌కు అనుమతి వచ్చింది. రైతులకు ఇబ్బంది లేకుండా భూసేకరణ చేస్తాం’ అని తెలిపారు.

February 26, 2026 / 06:50 PM IST