• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చిన్నారి ప్రాణరక్షణకు జనసైనికుల అభయహస్తం

W.G: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో రాయలం జనసైనికులు చూపుతున్న చొరవ అభినందనీయమని ఎమ్మెల్యే రామాంజనేయులు కొనియాడారు. అనారోగ్యంతో బాధపడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక వైద్య ఖర్చుల నిమిత్తం సేకరించిన రూ.2.65 లక్షల విరాళాన్ని సోమవారం ఆయన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ‘సేవ్ పునర్విక పోస్టర్ ను ఆవిష్కరించారు.

March 2, 2026 / 07:01 PM IST

కొయ్యూరు ఎంఈవో నియామకం

ASR: కొయ్యూరు మండల విద్యాశాఖ అధికారిగా పాటి సింహాచలం నియమితులయ్యారు. కొయ్యూరు మండలంలోని రావణాపల్లి ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న సింహాచలం ఇటీవల పదోన్నతి పొందారు. ఈమేరకు, ఆయన సోమవారం కొయ్యూరు ఎంఈవోగా నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. మండలంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

March 2, 2026 / 07:01 PM IST

‘ఛలో విజయవాడ’కు జర్నలిస్టుల పిలుపు

VSP: వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 4న ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు పి. నారాయణ్ తెలిపారు. ఆ రోజు ఉదయం విజయవాడలో శాంతియుత ర్యాలీ నిర్వహించి అనంతరం సభ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

March 2, 2026 / 07:01 PM IST

జిల్లా పోలీస్ కార్యాలయంలో 165 ఫిర్యాదులు

GNTR: గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మొత్తం 165 ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఫోన్‌ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.

March 2, 2026 / 07:00 PM IST

అంతర్జాతీయ అబాకస్ పోటీల్లో తాడిపత్రి విద్యార్థుల సత్తా

ATP: చెన్నైలో నిర్వహించిన 10వ అంతర్జాతీయ అబాకస్ పోటీల్లో తాడిపత్రి ప్రణవ్ అబాకస్ విద్యార్థులు అద్భుత ప్రతిభ చాటారు. 10 వేల మంది పాల్గొన్న ఈ పోటీల్లో ప్రణవ్ ఇన్స్టిట్యూట్ నుంచి 42 మంది విద్యార్థులు కేవలం 10 నిమిషాల్లో 200 గణిత ప్రశ్నలను సాధించారు. వీరిలో 8 మంది ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్, 20 మంది ఛాంపియన్స్, 14 మంది టాపర్స్‌గా నిలిచారు.

March 2, 2026 / 07:00 PM IST

మెళవాయిలో తీరిన తాగునీటి కష్టాలు

సత్యసాయి: మెళవాయి గ్రామంలో దీర్ఘకాలంగా ఉన్న తాగునీటి సమస్యను మడకశిర MLA ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పరిష్కరించారు. గ్రామంలో నీటి ఎద్దడి దృష్ట్యా కొత్త బోరు వేయించి, మోటారు పంపు సెట్ బిగించడంతో పాటు పైపులైన్ పనులు పూర్తి చేయించారు. పీ. కుంచిటిగ వక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ, స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

March 2, 2026 / 07:00 PM IST

కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NGKL: ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఇవాళ వైభవంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దంపతులు డా. కూచుకుళ్ల సరిత రాజేష్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

March 2, 2026 / 07:00 PM IST

‘విష జ్వరాల నుంచి ప్రజలను కాపాడండి: CPM

NDL: దోమల నివారణ పై చర్యలు చేపట్టి విష జ్వరాల బారిన పడకుండా ప్రజలను కాపాడాలని CPM పార్టీ పట్టణ కార్యదర్శి ఏ. రణదీర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆత్మకూరు పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామ్ నాయక్ మాట్లాడుతూ.. పారిశుధ్య పనులు చేపట్టడం ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:00 PM IST

నార్నూరులో హోలీ పండుగ సామాగ్రిలు విక్రయం

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక మార్కెటులో హోలీ పండుగ నేపథ్యంలో సామాగ్రిలు జోరుగా అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రోజున హోలీ జరుపుకుంటున్న సందర్బంగా రంగులు, వివిధ పూజ సామాగ్రిలను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో సోమవారం మార్కెటులోని దుకాణాల వద్ద రద్దీ ఏర్పడింది. హోలీ పండుగ సందర్భంగా రసాయన రంగులతో అడ్డుకోవద్దని అధికారులు సూచించారు.

March 2, 2026 / 07:00 PM IST

ఫిర్యాదులపై వేగవంతమైన పరిష్కారానికి ఆదేశం: కలెక్టర్

W.G: ప్రజా ఫిర్యాదులను నాణ్యతతో, వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ జీ. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 262 వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, డీఆర్వో రామునాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:00 PM IST

‘కార్యక్రమాల గురించి రాహుల్ ఆరా’

ప్రకాశం: వికారాబాద్‌లోని ఓ రిసార్ట్స్ లో జరుగుతున్న ఏపీ & తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ శిక్షణ శిబిరంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ హాజరవ్వగా, ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యక్రమాల గురించి జిల్లా అధ్యక్షులు షేక్ సైదా‌ను అడిగి తెలుసుకున్నారు. సంస్థ గత నిర్మాణాల గురించి రాహుల్‌కు వివరించారు.

March 2, 2026 / 07:00 PM IST

కోనసీమ జిల్లా వ్యాప్తంగా ముమ్మర వాహన తనిఖీలు

కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని ఎస్.హెచ్.ఓ (SHO)లు, పోలీస్ సిబ్బంది ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ లేని వారికి జరిమానా విధించారు.

March 2, 2026 / 07:00 PM IST

‘పూర్తి దర్యాప్తు చేపట్టాలి’

ASR: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శాంత కుమారి కోరారు. ఈమేరకు సోమవారం బీజేపీ జనతా వారధి కన్వీనర్ మినుముల గోపాలపాత్రుడు తదితరులతో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్‌కు వినతిపత్రం అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో, లిక్కర్ పాలసీలో భారీ ఆర్ధిక కుంభకోణం జరిగిందని ఆరోపించారు.

March 2, 2026 / 06:59 PM IST

‘నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు’

PDPL: మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ జహీరాబాద్‌లో 800 ఉద్యోగాలు DEET సహకారంతో భర్తీ చేయనున్నారు. NAPS ట్రైనీ 300, డిప్లమో అప్రెంటిస్ 200, ఐటిఐ అప్రెంటిస్ 300 ఉద్యోగాలు కలవు. ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమో, డిగ్రీ ఫెయిల్ అభ్యర్థులు సైతం అర్హులు. జీతం నెలకు 14000-20000, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. ఆసక్తి గల జిల్లా వాసులు QR స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.

March 2, 2026 / 06:57 PM IST

ఇంఛార్జ్ అదనపు కలెక్టర్‌గా దిలీప్ కుమార్

NZB: జిల్లా ఇంఛార్జ్ అదనపు కలెక్టర్‌గా (స్థానిక సంస్థలు) దిలీప్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అదనపు కలెక్టర్‌గా కొనసాగిన ఐ.ఏ.ఎస్ అధికారి అంకిత్‌కు పదోన్నతి కల్పిస్తూ ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసిన విషయం విధితమే. ఆయన స్థానంలో ఇంఛార్జ్ అదనపు కలెక్టర్‌గా నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్‌ను నియమించారు.

March 2, 2026 / 06:56 PM IST