• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు

SRCL: జిల్లాలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు ఇవాళ ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు 16 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్ష రాయడం పూర్తిచేసిన పరీక్ష సమయం ముగిసిన తర్వాతనే బయటకు పంపిస్తారు.

February 26, 2026 / 10:24 AM IST

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండో సంవత్సరం విద్యార్థులు నేడు తెలుగు సాంస్కృత పరీక్షలను రాయనున్నారు.

February 26, 2026 / 10:22 AM IST

పేదింటి కల ప్రజా ప్రభుత్వంలో నెరవేరింది

RR: చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో భాగంగా స్లాబ్ పనులను కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి కల ప్రజా ప్రభుత్వంలో నెరవేరిందని, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు పక్కా ఇంటిని నిర్మించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

February 26, 2026 / 10:22 AM IST

జిల్లా కలెక్టర్‌గా.. సందీప్ కుమార్ ఝూను

JN: రాష్ట్ర ప్రభుత్వం గురువారం భారీగా కలెక్టర్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషను, జోగులంబ గద్వాల్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయన స్థానంలో సందీప్ కుమార్ ఝూను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వెంటనే ఈ బదిలీలు అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

February 26, 2026 / 10:22 AM IST

ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు బదిలీ

MBNR: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముగ్గురు కలెక్టర్లు సహా ఇద్దరు అదనపు కలెక్టర్ల పై బదిలీ చేసింది. మహబూబ్‌ నగర్ కలెక్టర్ విజయేందిర, నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, గద్వాల కలెక్టర్ బి.ఎం.సంతోష్‌లను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు. అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్ (మహబూబ్‌ నగర్), కీమ్యా నాయక్ (వనపర్తి)లకు కూడా స్థానచలనం కలిగింది.

February 26, 2026 / 10:21 AM IST

ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలకు తెరదించుతూ, రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ మూవీలతో మెప్పించిన ఈ జంట, ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒక్కటి అవ్వడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

February 26, 2026 / 10:20 AM IST

అధునాతన ఫుడ్ రవాణా ట్రక్కులను పరిశీలించిన కలెక్టర్

కడపలో దేశానికే స్ఫూర్తిగా ఏర్పాటైన ‘సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్’ ద్వారా పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని చేరవేసేందుకు సిద్ధం చేసిన అధునాతన ఫుడ్ ట్రక్కులను కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి బుధవారం రాత్రి పరిశీలించారు. యూలర్ సంస్థ ప్రతినిధులు కలెక్టరేట్‌లో ఈ ట్రక్కుల పనితీరు, మానిటరింగ్ విధానంపై కలెక్టర్‌కు డెమో ఇచ్చి, వాటి ప్రత్యేకతలను వివరించారు.

February 26, 2026 / 10:20 AM IST

ఇద్దరు ఏఎస్సైలపై బదిలీ వేటు

W.G: తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు ఏఎస్ఐలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పి.సత్యనారాయణను మొగల్తూరుకు, ఎం.రాజ్యలక్ష్మిని భీమవరం వన్ టౌన్‌కు పంపారు. ఇటీవల స్టేషన్ సిబ్బందిపై వచ్చిన పలు ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపిన అనంతరం ఈ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

February 26, 2026 / 10:20 AM IST

కర్లపాలెంలో పోలీసుల తనిఖీలు

BPT: కర్లపాలెం సెంటర్, మసీదు, బుద్దాం, గణపవరం రోడ్లలో ఎస్సై రవీంద్ర గురువారం తనిఖీలు నిర్వహించారు. గంజాయి విక్రయించినా, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. కొత్త వ్యక్తులు వస్తే గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నారు. అలాగే, నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తామని ఆయన హెచ్చరించారు.

February 26, 2026 / 10:18 AM IST

వీర సావర్కర్ వర్ధంతి.. బండి సంజయ్ నివాళులు

స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ X వేదికగా పోస్ట్ చేశారు. ‘హిందుత్వాన్ని జాతీయ చైతన్య దీప్తిగా ప్రతిష్ఠించిన మహా తపస్వి. సనాతన ధర్మ రక్షణే స్వరాజ్య సంకల్పంగా చాటిన అజేయ ధైర్యస్వరూపి. అండమాన్ కారాగార అంధకారంలోనూ స్వాభిమాన జ్యోతిని వెలిగించిన ధీశాలి. వీర సావర్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావునికి నివాళులు’ అంటూ పేర్కొన్నారు.

February 26, 2026 / 10:16 AM IST

రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదే..!

NLR: నెల్లూరులో భూదేవి శ్రీదేవి సమేత శ్రీతల్పగిరి రంగనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో నేడు ప్రారంభమయ్యాయి. మార్చి 8వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. మార్చి 2న హనుమంతసేవ, 3న బంగారు గరుడసేవ, 4న కళ్యాణోత్సవం, 5న రథోత్సవం, 6న తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ప్రధానోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది.

February 26, 2026 / 10:16 AM IST

మానవత్వం చాటుకున్న మిత్రులు

KRNL: పెద్దకడబూరు మండలంలోని నాగలాపురం గ్రామానికి చెందిన 2007–2008 యస్.యం.కె.వి ఉన్నత పాఠశాల పదవ తరగతి బ్యాచ్ మిత్రుడు బి. కేశవప్ప అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బ్యాచ్ మిత్రులు రూ. 36,500లను సమీకరించి గురువారం సహాయంగా అందజేశారు. అదేవిధంగా దేవాలయం వద్ద తీసుకున్న రూ. 6,500 అప్పును కూడా తీర్చారు.

February 26, 2026 / 10:16 AM IST

‘కష్టపడిన వారిని గుర్తుంచుకుంటుంది’

ప్రకాశం: పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తలను గుర్తుంచుకుంటుందని కనిగిరి వైసీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. గురువారం హనుమంతుని పాడు మండలం కొండారెడ్డిపల్లి గ్రామ పార్టీ నాయకులు ఇన్‌ఛార్జ్‌ని కలిసి గ్రామ కమిటీ నియామకాలకు సంబంధించిన పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కొండపురెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, నారాయణ, సల్మాన్ రాజు పాల్గొన్నారు.

February 26, 2026 / 10:15 AM IST

MHBD జిల్లా కలెక్టర్‌గా.. స్నేహ శబరీష్

MHBD: రాష్ట్ర ప్రభుత్వం గురువారం భారీగా కలెక్టర్లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్‌ను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. అలాగే MHBD జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అద్వైత్ కుమార్ సింగ్ను స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.

February 26, 2026 / 10:15 AM IST

కరీంనగర్ జిల్లాకు నూతన కలెక్టర్‌

కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న పమేలా సత్పతిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం.. కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా చిత్ర మిశ్రాను నియమించారు. ప్రస్తుతం ఆమె ITDA ఏటూరునాగారంలో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నూతన కలెక్టర్ చిత్ర మిశ్రా రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు.

February 26, 2026 / 10:14 AM IST