• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు

MDK: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న వ్యవసాయ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీ పుణ్యవతి పేర్కొన్నారు. మాసాయిపేట మండలానికి మంజూరైన మూడు స్పేయర్లు, మూడు రోటవేటర్‌లను మండల వ్యవసాయధికారి కవితతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వం వ్యవసాయం ప్రోత్సహించడానికి సబ్సిడీ పరికరాలను అందజేస్తున్నట్లు తెలిపారు.

February 26, 2026 / 07:07 PM IST

పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం: జూకంటి బాబు

BHNG: పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని జూకంటి బాబు ఫౌండేషన్ అధ్యక్షులు జూకంటి బాబు తెలిపారు. గురువారం ఆలేరు మండలం టంగుటూరు గ్రామం ఎలగందుల రాజ్యలక్ష్మి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నాలుగు ఆకర్షణీయమైన రంగులతో కూడిన యూనిఫామ్‌లను ఆయన అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.

February 26, 2026 / 07:05 PM IST

అసెంబ్లీలో బొగ్గరం విద్యార్థుల సందడి

PLD: శాసనసభ సందర్శనలో భాగంగా ఈపూరు మండలం బొగ్గరం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు గురువారం అసెంబ్లీకి విచ్చేశారు. వారికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సాదరంగా స్వాగతం పలికి, విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ప్రజా సమస్యలపై సభలో చర్చలు ఎలా జరుగుతాయో వివరించిన ఆయన, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.

February 26, 2026 / 07:03 PM IST

‘డ్రైవింగ్ స్కూల్స్‌పై తనిఖీలు చేపట్టాలి’

KDP: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న డ్రైవింగ్ స్కూల్స్‌పై రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టాలని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కొన్ని స్కూల్స్‌లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, అనుభవం లేని బోధకులు ఉండడం, ట్రాఫిక్ నియమాలపై సరైన అవగాహన కల్పించకపోవడం జరుగుతోందని ఆరోపించారు.

February 26, 2026 / 07:03 PM IST

శాంతి భద్రతల పరిరక్షణలో SI పాత్ర కీలకం: SP

ADB: శాంతి భద్రతల పరిరక్షణలో రూరల్ SI విష్ణువర్ధన్ పాత్ర కీలకం అని SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదివాసీల అభివృద్ధి, విద్యార్థులకు పరీక్ష సామాగ్రి, క్రీడారంగంలో అభివృద్ధి చెందడానికి విష్ణువర్ధన్ సేవలు మరువలేనివని అన్నారు. ఈ మేరకు మహిళా క్రీడాకారులకు ఆర్చరీ కిట్లు, ఎనిమిది మంది క్రీడాకారులకు ట్రాక్ సూట్స్ SP అఖిల్ మహాజన్ చేతుల మీదుగా గురువారం అందజేశారు.

February 26, 2026 / 07:02 PM IST

కొవ్వూరు సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే

E.G: అమరావతిలో CM చంద్రబాబును కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు 2027 గోదావరి పుష్కరాలు దృష్ట్యా కొవ్వూరులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మించాలని, ప్రభుత్వ ఆసుపత్రి 50 పడకల నుండి 150 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కోరారు. 5 ఎత్తి పోతల పథకాలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు అందించారు.

February 26, 2026 / 07:02 PM IST

షార్ట్ వీడియోలు ఎక్కువగా చూస్తున్నారా?

షార్ట్ వీడియోలు చూడటం అలవాటు పడిన వారి మెదడులో దృష్టిని కేంద్రీకరించే భాగాలు నెమ్మదిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఏదైనా పని మీద దృష్టి పెట్టి చేయాలన్నా లేదా దృష్టిని మళ్ళీ పని మీదకు మళ్ళించాలన్నా మెదడు చాలా ఇబ్బంది పడుతోంది. వీడియోలు చూస్తూ ఆపలేకపోవడం వల్ల మెదడులో సెల్ఫ్ కంట్రోల్ శక్తి తగ్గుతోంది.

February 26, 2026 / 07:00 PM IST

తుళ్లూరు జాబ్ మేళాలో 104 మందికి ఉద్యోగాలు

GNTR: తుళ్లూరు స్కిల్ హబ్‌లో గురువారం నిర్వహించిన జాబ్ మేళా ద్వారా 104 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సుమారు 500 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ మేళాలో మరో 31 మంది తదుపరి రౌండ్లకు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఏపీసీఆర్‌డీఏ (APCRDA) అధికారులు నియామక పత్రాలను అందజేశారు.

February 26, 2026 / 06:58 PM IST

గరికపాటి ప్రవచనం.. అధిక సంఖ్యలో భక్తజనం

PDPL: పెద్దపల్లి జిల్లా మంథనిలో శకుంతలోపాఖ్యానం ప్రవచనాలకు విశేష స్పందన లభిస్తోంది. వివిధ మండలాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున హాజరవుతున్నారు. గరికిపాటి ప్రవచనాలు వినేందుకు తొలిరోజు వేసిన 2500 కుర్చీలు సరిపోలక, రెండో రోజు 600 అదనంగా ఏర్పాటు చేశారు. గురువారం చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది.

February 26, 2026 / 06:58 PM IST

పాల డైరీలలో అధికారుల తనిఖీలు

ప్రకాశం: ఒంగోలులో పాల డైరీలపై గురువారం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి. వేణుగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ అధికారి శంషాఖాన్, శివతేజ అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పాలలో కల్తీ జరుగుతోందన్న ఆరోపణలతో ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. అలాగే తాళ్లూరు మండలం సోమవరప్పాడులో కూడా తనిఖీ చేసి, పాల నమూనాలను సేకరించామని అధికారులు తెలిపారు.

February 26, 2026 / 06:58 PM IST

గుడ్, బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన

కృష్ణా: మోపిదేవిలోని జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు గుడ్, బ్యాడ్ టచ్ గురించి ఎస్సై గౌతమ్ కుమార్ గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే తల్లిదండ్రులకు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

February 26, 2026 / 06:58 PM IST

విజయ్, రష్మిక పెళ్లి ఫొటోలు వచ్చేశాయ్

విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 10:10కి రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను రష్మిక అభిమానులతో పంచుకుంది. ‘హాయ్ మై లవ్స్.. నా భర్తను మీకు పరిచయం చేస్తున్నా.. మిస్టర్ విజయ్ దేవరకొండ’ అని పోస్ట్ చేసింది.

February 26, 2026 / 06:58 PM IST

సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే

PLD: గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. పిడుగురాళ్లలోని పల్వరైజింగ్ మిల్లుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సంబంధిత మంత్రులు, అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

February 26, 2026 / 06:58 PM IST

‘ప్రతి విద్యార్థి బ్రాండ్ అంబాసిడర్ కావాలి’

MDK: ప్రతి విద్యార్థి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే బ్రాండ్ అంబాసిడర్‌గా మారాలని జిల్లా ఎస్పీ డివి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై ‘Arrive-Alive’ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండో విడత చేపట్టినట్టు వివరించారు.

February 26, 2026 / 06:58 PM IST

అభివృద్ధి పనులపై ఎంపీడీవో సమీక్ష

AKP: కోటవురట్ల మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీవో చంద్రశేఖర్ గురువారం మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. వివిధ దశలో ఉన్న పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు. అలాగే నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు చేరుకోవాలన్నారు. డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు, పీఆర్ ఏఈ వర్మ పాల్గొన్నారు.

February 26, 2026 / 06:57 PM IST