• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రోడ్డు ప్రమాదం.. దంపతులకు గాయాలు

గుంటూరు బృందావన్ గార్డెన్స్‌కు చెందిన నాలి గురుబ్రహ్మం, శాంతి దంపతులు శుక్రవారం మార్టూరు సమీపంలోని రాజుపాలెం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అద్దంకిలో ఉన్న కుమార్తెను చూసి బైక్‌పై తిరిగి వస్తుండగా, బస్సు వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దంపతులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

February 20, 2026 / 06:06 PM IST

ప్రతి వర్గానికి సమాన హక్కులు అవకాశాలు: వేణు

SRCL: ప్రతి వర్గానికి సమానహక్కులు, అవకాశాలు న్యాయం అందించాలని  లోక్ అదాలత్ సభ్యులు ఆడెపు వేణు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో రాజనీతి శాస్త్ర విభాగం సహకారంతో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంను నిర్వహించారు. అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు.

February 20, 2026 / 06:04 PM IST

దేశంలో TGను రోల్ మోడల్ చేస్తాం: మంత్రి

TG: AI, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌ను సామాన్యుడికి చేరువ చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. డిజిటల్ గవర్నెన్స్‌లో TGను దేశంలో రోల్ మోడల్‍గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్య సాధనలో టెక్నాలజీని ఓ ట్రాన్స్ ఫార్మేషన్ టూల్‍గా మార్చుకుంటున్నామన్నారు.

February 20, 2026 / 06:04 PM IST

ఘనంగా అభయ అంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ఠ

SKLM: సారవకోట(మం) తర్లిలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకులు, జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు ఎంపీపీ బైరగినాయుడు ఉన్నారు.

February 20, 2026 / 06:04 PM IST

‘వాహనం ఒక్కటే.. ట్యాక్సులు ఎన్ని’

KNR: తిమ్మాపూర్ మండలం రేణుగుంట టోల్ ప్లాజా వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కోట శ్యాం కుమార్ ప్లకార్డ్ పట్టుకుని నిరసన చేపట్టారు. వాహనం కొనుగోలు చేసినప్పుడే లైఫ్ ట్యాక్స్ కట్టానని, అయినా టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి ట్యాక్స్ వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే టోల్ ప్లాజాలు తొలగించాలని డిమాండ్ చేశారు.

February 20, 2026 / 06:03 PM IST

పత్తి కొనుగోలు గడువు పెంచాలని కలెక్టర్‌కి వినతి

ASF: ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రైతుల విజ్ఞప్తి మేరకు CCI ద్వారా పత్తి కొనుగోలు గడువును మార్చి 20 వరకు పొడిగించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ కోరారు. ఈ మేరకు శుక్రవారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మంగతో కలిసి కలెక్టర్ కె. హరితని కలిసి విజ్ఞప్తి చేశారు. రైతుల విజ్ఞప్తిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని శ్యామ్ నాయక్ తెలిపారు.

February 20, 2026 / 06:02 PM IST

ఆసిఫాబాద్లో 32 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత

ASF: జిల్లాలో ఎండలు మొదలయ్యాయి. ఓ వైపు ఉదయం చలి ఉంటూనే మధ్యాహ్నం ఎండలు దంచి కొడుతుండటంతో జిల్లా ప్రజలు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఆసిఫాబాద్లో శుక్రవారం 32 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. అయితే, వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మేలో పరిస్థితి ఏంటని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

February 20, 2026 / 06:01 PM IST

విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి

BPT: బల్లికురవ మండలం ఉప్పుమాగులూరు ZP హైస్కూల్‌లో శుక్రవారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ 208 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఈ సైకిళ్లు ఎంతో మేలు చేస్తాయన్నారు. విద్యార్థుల చదువుల కోసం ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.

February 20, 2026 / 06:01 PM IST

జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని స్థానిక టీచర్స్ కాలనీలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ ప్రాంగణంలో నూతన నిర్మాణ పనులకు శుక్రవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. అర్చకుల నివాస గదులు, నిత్య హోమాలు, అక్షరాభ్యాసాల కోసం నిర్మించనున్న ప్రత్యేక మండపానికి మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ ఛైర్మన్ మల్లికార్జున రావు కలిసి భూమి పూజ నిర్వహించారు.

February 20, 2026 / 06:01 PM IST

‘సామాజిక న్యాయం ద్వారానే దేశ ప్రగతి’

ప్రకాశం: సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా కనిగిరి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, సమాన అవకాశాలు ప్రతి పౌరుడికి అందేలా చేయడమే సామాజిక న్యాయ దినోత్సవం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

February 20, 2026 / 06:00 PM IST

ఖానాపూర్‌లో 10వ శతాబ్దపు విగ్రహాలు లభ్యం..!

NRML: ఖానాపూర్ మండలంలోని బీర్నంది – కొమ్ము తాండా మధ్య అటవీ ప్రాంతంలో క్రీ.శ.10వ శతాబ్దానికి చెందిన విగ్రహాలను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకులు రాజ్ కుమార్ తెలిపారు. చాళుక్యుల శైలిలో ఉన్న ద్విభుజ గణపతి, రాతిపై మలచిన భక్తాంజనేయ స్వామి, అరుదైన నాగబంధం, అలంకరణ స్తంభం ఇక్కడ లభ్యమయ్యాయి. భీమన్న గుడి చారిత్రక సంపదగా, స్థానికులను ఆకట్టుకుంటోంది.

February 20, 2026 / 06:00 PM IST

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహిస్తున్నాం: కలెక్టర్

E.G: స్వర్ణగ్రామ/స్వర్ణవార్డ్ శాఖ ఆధ్వర్యంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ శాఖలకు విధాన రూపకల్పన, సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారులకు సేవలు ముందస్తుగా అందించేందుకు అవసరమైన సమగ్ర డేటాను సేకరించడం సర్వే ప్రధాన ఉద్దేశమన్నారు. RTGS డేటాను పూర్తి స్థాయిలో సక్రమంగా నమోదు చేయాలన్నారు.

February 20, 2026 / 06:00 PM IST

సచివాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్

ATP: గుత్తి మున్సిపాలిటీలోని 15వ వార్డు సచివాలయాన్ని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి, సేవలను మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు కనిపించే విధంగా డిస్‌ప్లే బోర్డులో ప్రదర్శించాలన్నారు. విధులకు సక్రమంగా హాజరు కావాలన్నారు.

February 20, 2026 / 06:00 PM IST

‘ఉద్యమకారులను ఆదుకునేందుకు సబ్ కమిటీ’

NZB: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్య మంలో జైలుకు వెళ్లిన ఉద్యమకారులను ఆదుకునేందుకు త్వరలో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. శుక్రవారం ఆయన NZBలో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో మృతి చెందిన వారికి 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు.

February 20, 2026 / 06:00 PM IST

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న 

‘గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని ఎవరికి పేరు?A) గోపాలకృష్ణ గోఖలేB) దాదాభాయ్ నౌరోజీC) సర్దార్ వల్లభాయ్ పటేల్D) మదన మోహన మాలవీయ నిన్నటి ప్రశ్న: హైదరాబాద్ రాష్ట్ర తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి ఎవరు?జవాబు: బూర్గుల రామకృష్ణారావు

February 20, 2026 / 06:00 PM IST