• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

W.G. పాలకొల్లు పట్టణంలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాగరాజుపేట నుంచి పాలమూరు వరకు రూ.4.30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ మాజీ విప్ అంగర, కూటమి నాయకులు పాల్గొన్నారు.

March 3, 2026 / 02:07 PM IST

‘శివ కళ్యాణం ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి’

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో శివ కళ్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాటు చేయాలని ఆలయ ఈవో రమాదేవి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఐదు రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాలలో భాగంగా 6వ తేదీ స్వామివారి కళ్యాణం, 8వ తేదీ రథోత్సవం నిర్వహిస్తామని, కళ్యాణోత్సవానికి వేలాది మంది తరలివచ్చే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేయాలని అన్నారు.

March 3, 2026 / 02:04 PM IST

ఎమ్మెల్యే‌తో కలిసి ముందుకెళ్లండి: రామనాథ్

NRML: నిర్మల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ద్వంద్వ రాజకీయాలను ఎండగడతామని బీజేపీ నేత రావుల రామనాథ్ హెచ్చరించారు. తైబజార్ సమస్యపై అధికార పార్టీ నేతలు డ్రామాలు ఆపాలని డిమాండ్ చేశారు. సొంత ప్రభుత్వమే ఉన్నందున సమస్యను పరిష్కరించాలని, లేదంటే ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు.

March 3, 2026 / 02:04 PM IST

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

PDPL 6కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. భార్య ఐదేళ్లుగా కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురైన కందునూరి రాజకుమార్ తన గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంటరితనం కారణంగా మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

March 3, 2026 / 02:02 PM IST

‘సింగరేణిలో లారీ డ్రైవర్లు & క్లీనర్ల వేతనాలు పెంచాలి’

MNCL: బెల్లంపల్లి సింగరేణి ఏరియాలో పనిచేస్తున్న లారీ డ్రైవర్, క్లీనర్,హెల్పర్‌లకు పెరిగిన ధరలకనుకూలంగా వేతనాలు పెంచి ఇతర సమస్యలు పరిష్కరించాలని AITUC రీజియన్ ప్రెసిడెంట్ ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం TTC సుదీర్‌కు సమ్మె నోటీస్ అందజేశారు. వారు మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధికి, లాభాలు రావడంలోను ట్రాన్స్ పోర్ట్ కార్మికుల పాత్ర కీలకమన్నారు.

March 3, 2026 / 02:00 PM IST

దరఖాస్తు గడువు పొడిగింపు

WNP: ఘనపురం మండలం దొంతికుంట తండాలో ఉన్న ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశానికి సీట్ల భర్తీకి దరఖాస్తు గడవు పొడిగించినట్లు ప్రత్యేక అధికారి ఉమాదేవి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోగా http://tgms.telangana.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నరు.

March 3, 2026 / 02:00 PM IST

సోమందేపల్లిలో అంగన్వాడీ కార్యకర్తల ధర్నా

సత్యసాయి: సోమందేపల్లిలో అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పెద్దన్న మాట్లాడుతూ.. అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తుందన్నారు. సమస్యలు పరిష్కరించమంటే అక్రమ అరెస్టులు చేయడం దారుణమన్నారు.

March 3, 2026 / 02:00 PM IST

ఈ నెల 8న ఉచిత కంటి వైద్య శిబిరం

ATP: పామిడిలోని బీకే కళ్యాణ మండపంలో ఈ నెల 8న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ తిరుపతి నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 8న ఉదయం 9 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుందన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

March 3, 2026 / 01:59 PM IST

అప్పుడు విజయ్‌ని చూసి భయపడ్డా: రష్మిక

విజయ్ దేవరకొండను చూసి మొదట్లో భయపడ్డానని రష్మిక గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి. ‘గీత గోవిందం’ షూటింగ్ సమయంలో కొత్త వ్యక్తులతో మాట్లాడటానికి బెరుకుగా ఉండేదని, అందుకే విజయ్‌తో నటించేటప్పుడు ఆందోళన పడ్డానని పేర్కొంది. విజయ్ చాలా కూల్ అని, అతని వల్ల సెట్‌లో పాజిటివ్ వాతావరణం ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం వీరిద్దరూ ‘రణబాలి’ చిత్రంలో నటిస్తున్నారు.

March 3, 2026 / 01:59 PM IST

మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు.. నలుగురిపై వేటు

TG: జడ్చర్ల ప్రభుత్వాస్పత్రి సిబ్బందిపై వేటు పడింది. సూపరింటెండెంట్ చంద్రకళతో పాటు నలుగురిని సస్పెండ్ చేశారు. ఆర్‌ఎంవో హరినాథ్, డ్యూటీ డాక్టర్, ఎంఎన్‌వోపై సస్పెన్షన్ వేటు పడింది. కాగా మార్చురీలో ఉన్న మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై విచారణ చేపట్టారు.

March 3, 2026 / 01:59 PM IST

రాష్ట్ర ప్రజలకు లోకేష్ హోలీ శుభాకాంక్షలు

AP: రాష్ట్ర ప్రజలకు మంత్రి లోకేష్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘వ‌సంత రుతువుకు స్వాగ‌తం ప‌లికే రంగుల సంబ‌రం హోలీ. చెడుపై గెలిచిన మంచికి సంకేతం హోలీ. పేదా- పెద్ద తార‌త‌మ్యాలు లేకుండా, కుల‌మ‌త భేదాలు చూడ‌కుండా రంగుల్లో అంతా క‌లిసిపోయి ఆనందాల‌ను పంచుకునేది హోలీ పండుగ’ అని ట్వీట్ చేశారు.

March 3, 2026 / 01:55 PM IST

మహిళా సర్పంచులకు ఘన సన్మానం

VZM: గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో మహిళా సర్పంచ్లను జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మంగళవారం ఘనంగా సత్కరించారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దీపిక, జడ్పీటీసీ తౌడు పాల్గొన్నారు.

March 3, 2026 / 01:55 PM IST

ఎంపీ కేశినేనిపై దేవినేని అవినాష్ ఆగ్రహం

AP: ఎంపీ కేశినేని చిన్నిపై వైసీపీ నేత దేవినేని అవినాష్ మండిపడ్డారు. తిరువూరు ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వేణుగోపాలస్వామి కళ్యాణ కార్యక్రమాన్ని చెడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. SC ఎమ్మెల్యే నియోజకవర్గంలో అతని రుబాబు ఏంటని ప్రశ్నించారు. తమ ఐదేళ్ల పాలనలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదని చెప్పారు. చంద్రబాబు, పవన్ దీనిపై సమాధానం చెప్పాలని అన్నారు.

March 3, 2026 / 01:53 PM IST

బనగానపల్లెలో పర్యటించిన మంత్రి బీసీ

NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. పట్టణ సమీపంలో ఉన్న అవుకుమెట్ట వద్ద ఇళ్ల పట్టాల పంపిణీ కోసం స్థలాన్ని మంత్రి, జాయింట్ కలెక్టర్ కార్తీక్ కలిసి పరిశీలించారు. 3,500 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి బీసీ పేర్కొన్నారు.

March 3, 2026 / 01:51 PM IST

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి

ELR: దెందులూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరాయంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. మంగళవారం పెదవేగి(మం) దుగ్గిరాల పార్టీ కార్యాలయంలో ఆయనను పలు గ్రామాలకు చెందిన ప్రజలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వారి వద్ద నుంచి అర్జీలు స్వీకరించి వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

March 3, 2026 / 01:50 PM IST