• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ముక్కోటి మైసమ్మ జాతరకు సర్వం సిద్ధం

MBNR: హమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామ ముక్కోటి మైసమ్మ జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో జరిగే ఈ వేడుకల్లో భాగంగా నేడు సాయంత్రం ‘బండ్లోత్సవం’, రేపు ‘బోనాలు’, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గాధిర్యాల్, రుసుంపల్లి తదితర గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

February 28, 2026 / 11:46 AM IST

ఉజ్జయిని అమ్మవారి గుడి మూసివేత

HYD: మార్చి 3న కేతు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఉభయ ఆలయాలు మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. 3న ఉదయం 8 గంటలకు ఆలయాల తలుపులు మూసివేసి దర్శనాలు నిలిపివేస్తారు. తిరిగి 4న ఉదయం 9 గంటలకు మహా మంగళహారతితో ఆలయాలు తిరిగి తెరిచి భక్తులకు దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. భక్తులు సహకరించాలని కోరారు.

February 28, 2026 / 11:46 AM IST

నమో అంటే నాయుడు, మోదీ: లోకేష్

AP: రాష్ట్రానికి బ్లూజెట్ సంస్థ రావడం శుభసూచికమని మంత్రి లోకేష్ అన్నారు. ఏపీ డబుల్ ఇంజిన్ సర్కారే కాదని.. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని పేర్కొన్నారు. నమో అంటే నరేంద్రమోదీ అని అదరికీ తెలుసు అని తెలిపారు. ఏపీలో నమో అంటే నాయుడు, మోదీ అని అంటారని చెప్పారు. కేంద్రంలో మోదీ.. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని వెల్లడించారు.

February 28, 2026 / 11:45 AM IST

108 గర్భిణీ ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం

ప్రకాశం: మర్రిపూడి మండలం చీమట గ్రామానికి చెందిన గర్భిణీకి పురిటి నొప్పులు అధికమవడంతో కుటుంబీకులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిగా చేరుకున్న సిబ్బంది ఒంగోలు వైద్యశాలకు తరలిస్తుండగా చీమకుర్తి సమీపంలో నొప్పులు అధికమై పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది శివ, సుభాని తెలిపారు. కుటుంబీకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

February 28, 2026 / 11:45 AM IST

‘విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి’

NRML: దిలావర్‌పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం పదవ తరగతి విద్యార్థులకు పది పరీక్షలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సదానందం మాట్లాడుతూ.. పది పరీక్షలను నిర్భయంగా వ్రాయాలని,విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.

February 28, 2026 / 11:45 AM IST

ఫోన్‌లోనే ఆధార్‌‌లో మార్పులు, చేర్పులు

గూగుల్ ప్లేస్టోర్‌లో ఆధార్ యాప్ డౌన్‌లోడ్ చేయాలి. ఆధార్ వివరాలు నమోదు చేసి 6 అంకెలతో కూడిన పిన్ సెట్ చేసుకోవాలి. ఫొటోతో కూడిన ఆధార్ కార్డు కనిపిస్తుంది. కింద డౌన్‌లోడ్, షేర్, బయోమెట్రిక్ లాక్ కనిపిస్తాయి. సర్వీస్ పేజీ తెరవగానే ఫోన్ నెంబర్, అడ్రస్ అప్‌డేట్ కనిపిస్తాయి. వీటిని ఎంపిక చేసుకుని మార్పులు, చేర్పులను ముఖ ఆధారిత నిర్ధారణ ద్వారా పూర్తి చేసుకోవచ్చు.

February 28, 2026 / 11:45 AM IST

లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేసిన కలెక్టర్

TPT: తూకివాకం పంచాయితీ ఎస్.యన్.పురంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేశారు. లబ్ధిదారుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేశామని చెప్పారు. ఇవాళ పింఛన్ తీసుకోనివారు సోమవారం కూడా పింఛన్ తీసుకోవచ్చని తెలిపారు.

February 28, 2026 / 11:45 AM IST

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే

WGL: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో నిన్న రాత్రి MLA దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నర్సంపేటకు ప్రత్యేక కేటాయింపులు మంజూరు చేయాలని కోరినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

February 28, 2026 / 11:44 AM IST

ప్రభుత్వాసుపత్రిలో పండ్ల తోటల వేలం

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలోని పండ్ల చెట్లకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ ప్రకటించారు. ఇందులో 62 మామిడి చెట్లతో పాటు సపోటా కొబ్బరి అల్లనేరేడు చెట్లు ఉన్నాయి. ఏడాది కాలానికి కనీస ధర రూ. 50 వేలుగా నిర్ణయించారు. ఆసక్తి గల వారు రూ. 500 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

February 28, 2026 / 11:44 AM IST

గువ్వలదిన్నెలో రైతులకు అవగాహన కార్యక్రమం

GDWL: కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నెలో ఆత్మ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం, నానో ఫెర్టిలైజర్లు, ఆయిల్ పామ్ సాగులోని మెళకువలను వివరించారు. ఆధునిక పద్ధతులు పాటించి అధిక లాభాలు పొందాలని సూచించారు. డీపీడీ జగ్గు నాయక్, ఏవో రాజవర్ధన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

February 28, 2026 / 11:44 AM IST

వీధి కుక్క దాడిలో 8 మందికి గాయాలు

KMM: నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో శనివారం ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. దొరికిన వారిని దొరికినట్లే కరవడంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. దీంతో కొందరు యువకులు ఆ పిచ్చికుక్కను వెంబడించి కర్రలతో కొట్టి చంపారు. దాడిలో గాయపడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

February 28, 2026 / 11:43 AM IST

రేపు రాష్ట్రస్థాయి హాకీ ఎంపిక పోటీలు

AKP: ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో రేపు సబ్ జూనియర్స్ బాలుర, బాలికల రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కొఠారు నరేష్ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు పోటీలు ప్రారంభం అవుతాయన్నారు. 2010 అక్టోబర్ 1 తరువాత జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు.

February 28, 2026 / 11:40 AM IST

అంగన్వాడీలకు వేసవి సెలవులు పెంపు..?

KDP: అంగన్వాడీలకు వేసవి సెలవులు 15 నుంచి 30 రోజులకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. జీతాలు పెంచాలని ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు రాష్ట్ర ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవాలన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. త్వరలో దీనిపై కీలక అప్‌డేట్ వస్తుందన్నారు.

February 28, 2026 / 11:39 AM IST

కంపమల్లలో అధ్వానంగా మురుగు కాలువలు

NDL: కోవెలకుంట్ల (M) కంపమల్ల గ్రామంలోని రాజ కాలనీలో మురుగు కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. వ్యర్థాలు పేరుకుపోవడంతో మురుగునీరు ప్రవహించక నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది.ఈ కారణంగా దోమల బెడద పెరిగి రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని కాలనీవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు రోడ్లపైకి చేరుతుండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

February 28, 2026 / 11:39 AM IST

కాలుష్య కారకాలను నియంత్రించకపోతే పెను ప్రమాదం: సీవీ ఆనంద్

HYD: CII (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) & IGBC (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్) సమావేశంలో స్పెషల్ సెక్రటరీ సీవీ.ఆనంద్ పాల్గొన్నారు. 25కి పైగా సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. పట్టణీకరణను తగ్గించి, మెరుగ్గా ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

February 28, 2026 / 11:38 AM IST