MDCL: ఉప్పల్ డివిజన్ పరిధిలోని పది కాలనీ సంఘాలు పైప్‌లైన్ పనులపై ఆందోళన వ్యక్తం చేశాయి. గణేశ్‌నగర్ నుంచి చిలుకానగర్ రహదారిలో తవ్వకాల వల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని డిప్యూటీ కమిషనర్ జి. రాజుకు ఫిర్యాదు చేశారు. చిన్న పనులకు ఎక్కువ దూరం తవ్వకాలు చేయడం, కేబుల్, డ్రైనేజీ లైన్లు దెబ్బతినే ప్రమాదం ఉందని నేతలు పేర్కొన్నారు.
KMR: పిట్లం మండలంలోని చిన్న కోడపల్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన భజరంగ్ శుక్రవారం రాత్రి కాలకృత్యాల కోసం ఇంటి సమీపంలోని రెడ్డి చెరువు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.
భద్రాచలం పట్టణంలో ఓ యువకుడు బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. మృతుడు స్థానిక వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
SDPT: బెజ్జంకి మండలంలోని ఎల్లంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గుబిరే రాజయ్య (65) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం మృతుని సోదరుడు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ATP: గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా అనంతపురం రైల్వే స్టేషన్‌లో పోలీసులు శనివారం ఉదయం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ సాయంతో రైళ్లు, పార్శిల్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. నార్కోటిక్స్ గుర్తింపులో శిక్షణ పొందిన ‘టైగర్’ అనే జాగిలంతో ప్రయాణికుల లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
KDP: జమ్మలమడుగు పెద్దమ్మ తల్లి దేవరకు ఎస్పీ నచికేత్‌కు ఆహ్వానం అందింది. మార్చి 1వ తేదీన జమ్మలమడుగులో జరిగే దేవర మహోత్సవానికి రావాలని దేవర కమిటీ సభ్యులు ఎస్పీ కార్యాలయంలో ఆయనను కలిసి ఆహ్వానించారు. దాదాపు 17 సంవత్సరాల తర్వాత జరుగుతున్న పెద్దమ్మ తల్లి దేవర వేడుకలు ప్రశాంత వాతావరణంలో వైభవంగా సాగుతున్నాయని కమిటీ సభ్యులు SPకు తెలియజేశారు.
2016 టీ20 వరల్డ్‌కప్ సెమీపైనల్‌లో వాంఖడే స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో వెస్టిండీస్ విజయం సాధించడంతో భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం సూపర్ 8 స్టేజీలో రేపు టీమిండియా, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో 2016 ఓటమికి ఇప్పుడు బదులు తీర్చుకోవాలని భారత్ ఎదురు చూస్తోంది.
HYD: స్టాక్ మార్కెట్‌లో మీకు డిమార్ట్ అకౌంట్ ఉందా..? అయితే.. మేం స్టాక్ మార్కెట్ కాల్స్, సూచనలు చేస్తామని ఇమ్మడి ముబ్బడిగా వాట్సాప్, కాల్స్ ద్వారా సంప్రదిస్తుంటారు. ఒకవేళ వాటిని నమ్మితే నట్టేట మునిగినట్టే. భారీ నష్టం వచ్చిందా..? మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తారు. ఒక్కోసారి ఫిర్యాదు చేసినా ఫలితం ఉండదు. ఇలాంటి వాటి పై జాగ్రత్తగా ఉండాలని HYD పోలీసులు సూచించారు.
NLR: కోవూరు పంచాయతీ గుమ్మళ్ళదిబ్బలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదివారం పర్యటించనున్నట్లు టీడీపీ మండలాధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పాటూరులో ఏర్పాటు చేసిన చేనేత క్లస్టర్ ద్వారా చేనేత కార్మికులకు సాయంత్రం 4గంటలకు చేనేత ఉపకరణాలు పంపిణీ చేస్తారని వివరించారు.
RR: షాద్‌నగర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో నిర్వహిస్తున్న సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కాస్త రాజకీయ రంగు పులుముకోవడంపై LHPS కొత్తూరు మండల అధ్యక్షులు బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనా?లేక ఇందిరమ్మ విగ్రహ ప్రతిష్టాపనా?అని ప్రశ్నించారు. పవిత్రమైన దేవాలయ ప్రాంగణాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేశారన్నారు.
భారత క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి ముంబై క్రికెట్ అసోసియేషన్ అరుదైన గౌరవాన్ని కల్పించింది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు పెట్టాలని MCA అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. క్రికెట్‌కు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకుంది.
PDPL: సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామ పంచాయతీ వార్డుసభ్యుల కోసం నిర్వహించిన 5రోజుల శిక్షణ కార్యక్రమం ముగిసింది. గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, నిధుల వినియోగం, గ్రామసభల నిర్వహణపై సమగ్ర అవగాహన కల్పించారు. ముగింపు సందర్భంగా ఎంపీడీఓ దివ్యదర్శన్ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.
TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు.
PDPL: పాలకుర్తి మండలం కుక్కలగూడూరు ZPHSలో చదువుతున్న విద్యార్థులు “అవయవాలు – వాటి పని తీరు” అంశంపై అద్భుత ప్రదర్శన చేశారు. రుచి, స్పర్శ, వాసన, వినికిడి, చూపు వంటి ఇంద్రియాల పనితీరును నమూనాల ద్వారా స్పష్టంగా వివరించారు. బొడ్డు నవ్య, ఆవుల అవంతిక విద్యార్థినులు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పిల్లల సృజనాత్మకతను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
RR: అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన షాద్ నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. పట్టణంలోని హాజీపల్లి రోడ్డులోగల దుకాణం, జనరల్ స్టోర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణ యజమాని వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా.. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.