AP: తిరుపతిలోని దామినేడు వద్ద రూ.140 కోట్లతో, 15 ఎకరాల్లో నిర్మించనున్న నూతన జిల్లా కోర్టు భవనానికి జస్టిస్ సూర్యకాంత్ భూమిపూజ చేశారు. అనంతరం అమరావతిలో పర్యటించనున్న ఆయన.. న్యాయమూర్తుల బంగ్లాలను ప్రారంభించనున్నారు. అలాగే, హైకోర్టు సీజే గెస్ట్ హౌస్‌తో పాటు పిచ్చుకలపాలెం వద్ద జ్యూడిషియల్ అకాడమీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
సత్యసాయి: కదిరి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామిని జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఇవాళ దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారి దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
KDP: ఎర్రగుంట్ల- కడప రోడ్డులోని జువారి రైల్వే బ్రిడ్జి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు బైక్పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్టు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఇరువురికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమించడంతో 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం: వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా మోటార్ వాహన చట్ట నిబంధనలను పాటించాలని శక్తి టీం హెచ్‌సీలు ఎం. గిరిధర్, కే. గణేష్ తెలిపారు. ఆదివారం కోటబొమ్మాలి మండలం మంచాల పేటలో స్థానికులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ విధిగా వాడాలని సూచించారు. ప్రమాదాలు జరిగేటప్పుడు 1033 టోల్ ఫ్రీ నెంబర్‌ను వినియోగించాలన్నారు.
ATP: గార్లదిన్నె మండలం బూదేడు గ్రామానికి చెందిన జొన్నే సూర్యనారాయణ కుమార్తె స్నేహలత వివాహానికి ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి ఆదివారం రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేశారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం సంతోషకరమన్నారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ చిత్రంపై క్రేజీ అప్డేట్ వచ్చేసింది! మార్చి 2న ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ ‘రాయ్ రాయ్ రారా’ విడుదల కానుంది. ఈ పాటను స్వయంగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పాడినట్లు టాక్. ఆయన గొంతులో వచ్చే పాటలు చార్ట్‌బస్టర్లే కాబట్టి, ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ భారీ చిత్రం ఏప్రిల్ 30, 2026న థియేటర్లలో సందడి చేయనుంది.
MNCL: మందమర్రి చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్, మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటుకు రూ. కోటి నిధులు మంజూరు చేసిన మంత్రి వివేక్‌కి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి సదానంద్ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం మాట్లాడుతూ గతంలో చెరువు కట్టను పరిశీలించిన మంత్రి అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా: గన్నవరంలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా సమర్థవంతంగా చేపట్టాలని నేతలకు సూచించారు. గ్రామ వార్డు స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద నిర్మించనున్న 16 కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు పాల్లొన్నారు.
అన్నమయ్య: రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన ప్రభాకర్ డేరంగుల అనే వ్యక్తి నూతన దర్శకుడుగా తెలుగు, తమిళ్ భాషలో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ తిరుపతిలోని హోటల్ బ్లెస్స్‌లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్‌కు తిరుమల దేవస్థానంకు పలువురు ప్రముఖులు విచ్చేశారు.
KRNL: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కార్యకలాపాల కారణాల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాచిగూడ – కర్నూలు సిటీ (17435), కాచిగూడ-రాయచూరు (67787) రైళ్లతో పాటు, కర్నూలు సిటీ-కాచిగూడ (17436) రైలును మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు.. 8 రోజులు రద్దు చేశారు. ప్రయాణికులు మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ కోరింది.
MDCL: చెంగిచెర్ల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల లిస్టును అధికారులు విడుదల చేశారు. 250C చెంగిచెర్ల నుంచి వయా చర్లపల్లి టూ సికింద్రాబాద్, 71A అఫ్జల్ గంజ్, 280 ఉప్పల్ మీదుగా సికింద్రాబాద్, 18C చెంగిచెర్ల డిపో నుంచి సికింద్రాబాద్, 49M/250 ఈసీఐఎల్ మీదుగా మెహదీపట్నం బస్సు అందుబాటులో ఉందని DM కవిత ప్రకటనలో తెలిపారు.
ELR: ఏపీ మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ నాయుడు ఆదివారం ఏలూరులో మాంసపు దుకాణాలపై తనిఖీలు చేపట్టారు. పాడైపోయిన చికెన్ విక్రయిస్తున్నట్లు గుర్తించి యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కల్తీ మాంసం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ, నిబంధనలు పాటించని షాపులకు జరిమానా విధించారు. నగరవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతుండటంతో మాంసం వ్యాపారుల్లో కలకలం రేపింది.
కళ్ల కింద నల్లటి వలయాలను కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చు. రోజుకు 7-8 గంటల నిద్ర అవసరం. తగినంత నీరు తాగి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ఫోన్, ల్యాప్‌టాప్ వాడకాన్ని తగ్గిస్తే మంచిది. కళ్లపై కీరా ముక్కలు లేదా ఐస్ కంప్రెస్ ఉంచితే ఉపశమనం లభిస్తుంది. శనగపిండి మిశ్రమాన్ని కళ్ల కింద రాసి, ఆరిన తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. కళ్ల దగ్గర ఐస్ కంప్రెస్ చేయాలి.
AP: బీహార్ సీఎం నితీష్‌కుమార్‌కు సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నితీష్ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాక్షించారు. ప్రజసేవలో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ట్వీట్‌లో పేర్కొన్నారు.