SDPT: తొగుట మండలం లింగంపేట గ్రామంలో ఎస్సీ కాలనీలో నీటి సమస్య తీర్చేందుకు పైపులైన్ ఏర్పాటు చేశారు. సర్పంచ్ గొడుగు జయమ్మ నర్సింలు బోరు నుంచి ప్రత్యేకంగా పైప్లైన్ ఏర్పాటు చేసి ఇంటింటికి నల్ల కలెక్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ యాసరేణి మురళి, వార్డు సభ్యులు అంజయ్య, లావణ్య, ఏఎంసీ డైరెక్టర్ అన్వర్, గ్రామస్తులు పాల్గొన్నారు.